బోయిన్‌పల్లి పోలీసులపై భూమా అఖిలప్రియ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-08-10T19:04:33+05:30 IST

బోయినపల్లి పోలీసుల‌పై కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్‌లో భూమా అఖిల ప్రియ ఫిర్యాదు చేశారు. తమ ఫ్లాట్‌లోకి పది మంది పోలీసులు అక్రమంగా జూలై 6వ తేదీన ప్రవేశించారంటూ..

బోయిన్‌పల్లి పోలీసులపై భూమా అఖిలప్రియ ఫిర్యాదు

హైదరాబాదు: బోయిన్‌పల్లి పోలీసులపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జూలై 6వ తేదీన సుమారు పది మంది బోయిన్‌పల్లి పోలీసులు తమ ఫ్లాట్‌లోకి అక్రమంగా ప్రవేశించారని ఆరోపించారు. కనీసం సెర్చ్ వారెంట్ కూడా ఇవ్వకుండా లోపలికి ప్రవేశించారని ఫిర్యాదు చేశారు. తమ వద్ద సీసీ ఫుటేజీ కూడా ఉందన్నారు. అనంతనం అందుకు సంబంధించిన వీడియోలు తదితర ఆధారాలను కేపీహెచ్‌బీ పోలీసులకు అఖిలప్రియ అందజేశారు. అయితే తాము అనుమతి తీసుకునే ఇంట్లోకి ప్రవేశించామని బోయిన్‌పల్లి పోలీసులు చెబుతున్నారు. ఒక కేసుకు సంబంధించి భార్గవ్ రామ్ తమ స్టేషన్‌కు విచారణకు రావాల్సి ఉందన్నారు. అయితే కొవిడ్ వచ్చినట్లు నకిలీ సర్టిఫికెట్ ఇచ్చి తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. రెండు సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదన్నారు. దీంతో స్టేషన్‌కు తీసుకొచ్చేందుకు తామే వారి ఇంటికి వెళ్లామని.. అయితే అక్కడికి వెళ్లే లోపు భార్గవ్ రామ్ తప్పించుకున్నారని చెప్పారు. తాము అనుమతి తీసుకునే లోపలికి ప్రవేశించామని, అక్రమంగా వెళ్లలేదని చెబుతున్నారు. ఈ కేసుపై కేపీహెచ్‌బీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Updated Date - 2021-08-10T19:04:33+05:30 IST