పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి

ABN , First Publish Date - 2021-07-24T05:59:59+05:30 IST

బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని

పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలి

  • 27న కేంద్ర మంత్రుల ఇళ్ల ముట్టడి: ఆర్‌.కృష్ణయ్య 

బర్కతపుర, జూలై 23(ఆంధ్రజ్యోతి):పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, చట్టసభల్లో బీసీలకు యాబై శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 27న ఢిల్లీలోని కేంద్ర మంత్రుల ఇళ్లను ముట్టడిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య తెలిపారు. అన్ని రాష్ర్టాల నుంచి తరలివచ్చే బీసీ నేతలతో ఈ నెల 26న  పార్లమెంటు ఎదుట భారీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం కాచిగూడలోని ఓ హోటల్‌లో 46 బీసీ కులసంఘాలు, ఉద్యోగ విద్యార్థి సంఘాలతో సన్నాహక సమావేశం జరిగింది. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రధానమంత్రిని కలిసి వినతిపత్రాలు అందజేస్తామని వెల్లడించారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు కె.నర్సింహగౌడ్‌, ఉదయ్‌నేత, రామలింగం, ఓంకార్‌గౌడ్‌, విద్యానందచారి, శ్రీనివాస్‌, సుభాష్‌, శివ పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-24T05:59:59+05:30 IST