అక్కను వేధిస్తున్నాడని బావను దారుణంగా చంపేశాడు!
ABN , First Publish Date - 2021-05-08T17:41:27+05:30 IST
అక్కను వేధిస్తున్నాడని బావను సొంత బావమరిది దారుణంగా హత్యచేసిన

హైదరాబాద్/నారాయణఖేడ్ : అక్కను వేధిస్తున్నాడని బావను సొంత బావమరిది దారుణంగా హత్యచేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం లింగాపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌లోని మహాదేవ్‌పూర్ పరిధిలోని బాలప్పనగర్కు చెందిన వడ్డె రాజు (33) ఖేడ్ మండలం లింగాపూర్‌లో భార్య, పిల్లలతో జీవిస్తున్నాడన్నారు. మనూరు మండలం బాదల్‌గాంకు చెందిన అతడి బావమరిది మక్కల దుర్గయ్య వారం నుంచి లింగాపూర్‌కు వచ్చి అక్క దగ్గరే ఉంటున్నాడు. వడ్డె రాజు తన భార్యను వేధింపులకు గురిచేస్తుండడంతో బామరిది దుర్గయ్య అతనిపై కోపం పెంచుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజుమున ఇంటి బయట నిద్రిస్తున్న రాజుపై దుర్గయ్య కట్టెతో దాడిచేశాడు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంమేరకు ఎస్ఐ వెంకట్‌రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ జరిపారు. చౌటకూరు మండలం శివ్వంపేటలో ఉండే మృతుడి సోదరుడు కుమార్ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.