PUB : సినీ పరిశ్రమలో పనిచేసే యువతి పట్ల పోకిరీల వేధింపులు

ABN , First Publish Date - 2021-12-23T18:37:54+05:30 IST

పబ్‌కు వచ్చిన ఓ యువతి పట్ల పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించారు.

PUB : సినీ పరిశ్రమలో పనిచేసే యువతి పట్ల పోకిరీల వేధింపులు

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : పబ్‌కు వచ్చిన ఓ యువతి పట్ల పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించారు. తమ కారులో ఎక్కాలంటూ వేధించారు. ఈ నెల 20న జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 36లోని క్లబ్‌ రోగ్‌ పబ్‌కు సినీ పరిశ్రమలో పనిచేసే ఓ యువతి స్నేహితులతో కలిసి వచ్చింది. కొంతమంది పోకిరీలు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె బయటకు వచ్చి వ్యాలెట్‌ పార్కింగ్‌లో కారు కోసం ఎదురుచూస్తుంది. వెంబడించిన పోకిరీలు ఆమెను అసభ్యకరంగా దూషించి దాడికి ప్రయత్నించారు. ఆమెను కారులో ఎక్కించుకునేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న యువతి తన కారులో వెళ్తుండగా అడ్డుకొని తగులబెడతామని బెదిరించారు. కొద్ది దూరం ఆమెను వెంబడించారు. బాధితురాలి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-23T18:37:54+05:30 IST