Revanth Reddy ఆదేశిస్తే అడుగేస్తా.. : Bandla Ganesh
ABN , First Publish Date - 2021-10-15T13:09:51+05:30 IST
. రేవంత్‌రెడ్డి పార్టీలో అత్యంత కీలక పదవిలో ఉన్నందున...
హైదరాబాద్ సిటీ/షాద్‌నగర్ : కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొనాలని మాజీ ఎంపీ మల్లు రవి సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను కోరగా రేవంత్ అన్న ఆదేశిస్తే అడుగు ముందుకు వేస్తానని బండ్ల గణేష్ సమాధానం ఇచ్చారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని బుచ్చిగూడ గ్రామ మాజీ సర్పంచ్ తాండ్ర సులోచనమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, మల్లురవి, బండ్ల గణేష్‌ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. రేవంత్‌రెడ్డి పార్టీలో అత్యంత కీలక పదవిలో ఉన్నందున మీరు కూడా పార్టీలో యాక్టీవ్ రోల్‌గా ఉండాలని మల్లురవి బండ్ల గణేష్‌కు సూచించారు.
ప్రతిభ ఉన్నవారికి సినీ పరిశ్రమలో అవకాశం కల్పిస్తా..
సినీ పరిశ్రమ పట్ల ఆసక్తి ఉన్న యువతకు సినీమాలో అవకాశం కల్పిస్తానని సినీ నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. షాద్‌నగర్ పట్టణం నుంచి కనీసం 500 మందికి సినీ పరిశ్రమలో అవకాశం కల్పించాలన్నదే తన అభిమతమన్నారు. గురువారం జర్నలిస్ట్ ఖాజాపాషా నటించిన గోలీమార్ పాటను ఆయన విడుదల చేశారు. అనంతరం బండ్ల గణేష్ మాట్లాడుతూ.. చిరంజీవి సినిమాలను ఆదర్శంగా తీసుకుని తాను సినీ పరిశ్రమంలో అడుగుపెట్టాననీ, ఎంతో పట్టుదలతో తన కల నేరవేర్చుకున్నాని చెప్పారు. పట్టుదల ఉంటే సినీ పరిశ్రమంలో అనేక అవకాశాలు ఉన్నాయని వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నటుడు ఖాజాపాషా, కోరియోగ్రాఫర్ కోనేటి రాజు, రెహ్మన్, ఖాదర్గోరే పాల్గొన్నారు.