‘బాలానగర్ ఫ్లైఓవర్‌కు పీజేఆర్ పేరు పెట్టాలి’
ABN , First Publish Date - 2021-06-28T13:08:40+05:30 IST
బాలానగర్ ఫ్లై ఓవర్‌కి మాజీ సీఎల్‌పీ నేత, దివంగత పి.జనార్దన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ/ బాలానగర్ : బాలానగర్ ఫ్లై ఓవర్‌కి మాజీ సీఎల్‌పీ నేత, దివంగత పి.జనార్దన్‌రెడ్డి (పీజేఆర్) పేరు పెట్టాలని ఏఐసీసీ సభ్యుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి బి.నిరంజన్, మేడ్చల్ జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు అడకులపల్లి దుర్గారాణీ ప్రభుత్వాన్ని కోరారు. పూర్వ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఐదుసార్లు ఎన్నికై స్థానికులతోపాటు యావత్ తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పీజేఆర్ కృషిచేశారని చెప్పారు. పీజేఆర్ హయాంలోనే బాలానగర్ ప్రాంతం అభివృద్ధి చేశారని, 1998లోనే బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జికి ప్రతిపాదనలు చేశారని, ఇప్పుడు ఇది సాకారమవుతోందన్నారు. ప్రజానేతగా గుర్తింపు పొందిన పీజేఆర్‌ను ప్రజలందరూ స్మరించుకునేందుకు బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.