అసెంబ్లీ ఆమోదం తరువాతే..కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక

ABN , First Publish Date - 2021-12-26T15:59:18+05:30 IST

జీహెచ్‌ఎంసీ కో ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు మరింత సమయం పట్టే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఐదుగురుగా ఉన్న సభ్యుల సంఖ్యను 15కు పెంచాలని

అసెంబ్లీ ఆమోదం తరువాతే..కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ కో ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు మరింత సమయం పట్టే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఐదుగురుగా ఉన్న సభ్యుల సంఖ్యను 15కు పెంచాలని భావిస్తోన్న ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు లేకుండా ముందుకు వెళ్లాలనుకుంటున్నట్టు సమాచారం. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించి అసెంబ్లీలో ఆమోదించాలని నిర్ణయించినట్టు ఉన్నతాధికారొకరు తెలిపారు. వాస్తవంగా గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే సవరణ అంశాన్ని ప్రవేశపెడతారన్న ప్రచారం జరిగింది. శాసనసభలో ఆ అంశం ప్రస్తావనకు రాలేదు. శీతాకాల సమావేశాల్లో కో ఆప్షన్‌ సభ్యుల సంఖ్య పెంపు చట్టాన్ని ఆమోదిస్తారని చెబుతున్నారు. ఆర్డినెన్స్‌ జారీ చేయొచ్చా, న్యాయపరమైన ఇబ్బందులుంటాయా.. అన్న అంశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఆమోదానికే సర్కారు మొగ్గు చూపుతుందని, ఆ తరువాతే సభ్యుల ఎంపికకు సంబంధించి బల్దియా కార్యదర్శి కార్యాలయం నోటిఫికేషన్‌ ప్రకటించనుంది.

Updated Date - 2021-12-26T15:59:18+05:30 IST