HYD: నగరంలో నకిలీ సర్టిఫికెట్ల తయారీ

ABN , First Publish Date - 2021-12-19T18:01:55+05:30 IST

నకిలీ సర్టిఫికెట్స్‌ తయారు చేసి ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపుతున్న ముఠాను హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి వివిధ డిగ్రీలకు

HYD: నగరంలో నకిలీ సర్టిఫికెట్ల తయారీ

ఇద్దరు నిందితుల అరెస్ట్‌ 

హైదరాబాద్‌ సిటీ: నకిలీ సర్టిఫికెట్స్‌ తయారు చేసి ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపుతున్న ముఠాను హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి వివిధ డిగ్రీలకు సంబంధించిన 220 నకిలీ సర్టిఫికెట్లు, ఆరు కంప్యూటర్లు, రెండు ప్రింటర్లు, 4 ల్యాప్‌టా్‌పలు, 3 పేపర్‌ బండిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ శనివారం మీడియాకు వివరాలు తెలిపారు. సయ్యద్‌ నవీద్‌ అలియాస్‌ ఫైసల్‌ బషీర్‌బాగ్‌లో క్యూబెజ్‌ ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో జూన్‌లో కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేశాడు. తన వద్దకు వచ్చే వారి నుంచి రూ.50 వేలు, రూ.75 వేలు తీసుకుని నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి, విదేశాలకు పంపుతున్నాడు. ఇందుకోసం డీటీపీ ఆపరేటర్‌గా సయ్యద్‌ ఓవైసీ అలీని నియమించుకున్నాడు. సమాచారం అందుకున్న సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగి నిందితులు సయ్యద్‌ నవీద్‌, సయ్యద్‌ ఓవైసీలను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. 

Updated Date - 2021-12-19T18:01:55+05:30 IST