అంతర్రాష్ట్ర చైన్‌స్నాచర్ ముఠా సభ్యుల అరెస్ట్
ABN , First Publish Date - 2021-05-20T18:06:11+05:30 IST
జవహర్‌నగర్ పోలీసులు ఇద్దరు చైన్‌స్నాచర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని రాచకొండ కమిషనరేట్...

3.5తులాల బంగారు చైన్, ద్విచక్ర వాహనం స్వాధీనం
చెన్నై/జవహర్‌నగర్: జవహర్‌నగర్ పోలీసులు ఇద్దరు చైన్‌స్నాచర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని రాచకొండ కమిషనరేట్ పోలీసులు తెలిపారు. ఈ నెల 17న చంద్రపురికాలనీలో కిరాణాదుకాణ యజమాని అంజమ్మ దగ్గరకు వచ్చిన యువకుడు పాన్‌మసాలా ప్యాకెట్ తీసుకుని వెళ్లే క్రమంలో అంజమ్మ మెడలో ఉన్న 3.5తులాల బంగారు గొలుసు తెంపుకుని ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. ఏసీపీ శివకుమార్, డీఐ మధుకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ నెల 18న యాప్రాల్ నుంచి బాలాజీనగర్‌కు వెళ్తున్న ఇద్దరు అనుమానితులను గుర్తించిన పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన గులాబ్‌సింగ్(26), శివాసింగ్ (21)గా వారిని గుర్తించారు. వారి నుంచి 3.5తులాల బంగారు గొలుసు, ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకున్న జవహర్‌నగర్ పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్ అభినందించారు.