ఆపత్కాలంలో ఆదుకుంటున్న ‘అన్నపూర్ణ’.. అన్నార్తులకు వర ప్రసాదిని

ABN , First Publish Date - 2021-05-30T14:09:05+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రాలు..

ఆపత్కాలంలో ఆదుకుంటున్న ‘అన్నపూర్ణ’.. అన్నార్తులకు వర ప్రసాదిని

హైదరాబాద్ సిటీ/సైదాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రాలు వలస కూలీలు, పేదలు, అన్నార్థులకు ఆపత్కాలంలో అసరాగా నిలుస్తున్నాయి. అన్నపూర్ణ పథకం ద్వారా గతంలో రూ.5కు పేదలకు భోజనం పెట్టేవారు.  ఇప్పుడు దానిని ఉచితం చేశారు. లాక్‌డౌన్‌లో ఎవరొచ్చినా ఉచితంగా అన్నం పెట్టేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. వలస కూలీలు, వివిధ ఆస్పత్రులు రోగుల సహాయకులు, అత్యవసర పనుల నిమిత్తం నగరానికి వచ్చిన ప్రజల ఆకలిని ఈ కేంద్రాలు తీరుస్తున్నాయి. ప్రతి భోజనంలో 100 గ్రాముల అన్నం, 100 గ్రాముల పప్పు, సాం బార్‌, పచ్చడి ఉండేలా  మెనూను పాటిస్తున్నారు. నగరంలో ప్రస్తుతం 250 అన్నపూర్ణ కేంద్రాలు ఉన్పట్లు సమాచారం. మలక్‌పేట నియోజకవర్గం ఓల్డ్‌ మలక్‌పేట వాటర్‌ ట్యాంక్దు, మూసారాంబాగ్‌, చౌరస్తా, జైళ్లశాఖ డీజీ కార్యాలయం, చాదర్‌ఘాట్‌చౌరస్తా, బాగే జహారాన72 బస్టాప్‌, నల్గొండ చౌరస్తా, సైదాబాద్‌ ప్రధాన రహదారిపై, ఐఎ్‌ససదన్‌ డివిజన్‌ సింగరేణికాలనీ రోడ్డులో, చంపాపేట ప్రధాన రహదారిపై కౌంటర్లు ఏర్పాటు చేసి ఉదయం 11 గంటల నుంచి భోజనాలు అందిస్తున్నారు.


మరో 11 కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే 

లాక్‌డౌన్‌లో పేద ప్రజల ఆకలి తీర్చేందుకు మలక్‌పేట నియోజకవర్గంలో కొత్తగా 11 చోట్ల అన్నపూర్ణ ఉచిత భోజనశాలలను ఏర్పాటు చేయాలని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల అధికారులను కోరారు. చావునీ డివిజన్‌లోని గుడ్డిబౌలిలో, మజీద్‌ ఎ నర్కి పక్కన, ఆజంపుర డివిజన్‌లో కాలాడేరలోని అంజుమన్‌ సమీపంలో, చాదర్‌ఘాట్‌ మూసానగర్‌లోని భారత్‌పెట్రోల్‌ బంకు పక్కన, ఓల్డ్‌మలక్‌పేట డివిజన్‌లోని వాటర్‌ ట్యాంక్‌ సమీపంలో, శంకర్‌నగర్‌ మురికివాడలో, ముసారాంబాగ్‌ డివిజన్‌లోని స్వామి వివేకానంద స్కూల్‌ సమీపంలో, సైదాబాద్‌ డివిజన్‌లోని పూసల బస్తీలోని చేపల మార్కెట్‌, క్రాంతినగర్‌లో, అక్బర్‌బాగ్‌ డివిజన్‌లోని సపోటాబాగ్‌లో, పల్టన్‌ చౌరస్తాలో అన్నపూర్ణ ఉచిత బోజనశాలలను ఏర్పాటు చేయాలని జోనల్‌ కమిషనర్‌ను కోరారు.


ఆకలి తీరుస్తున్నారు

లాక్‌డౌన్‌లో పనులు లేక పస్తులు ఉండాల్సిన సమయంలో ఉచితంగా రుచికరమైన భోజనం ఆందించి ఆకలి తీరుస్తున్నారు. అన్నపూర్ణ కేంద్రం మాకు పెద్దదిక్కుగా మారింది. కేంద్రాలు సంఖ్య పెంచాలి. - సీతారాం, భవన నిర్మాణ కార్మికుడు


ఎంతో ఉపశమనం

పేదల ఆకలి తీర్చడం కోసం జీహెచ్‌ఎంసి అన్నపూర్ణ కేంద్రాలు పెట్టి ఆకలి తీర్చడం హర్షణీయం. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోగా పూట గడవడం లేదు. ఉచిత భోజం కేంద్రాలతో ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. 

- లక్ష్మి, సింగరేణి కాలనీ.

Updated Date - 2021-05-30T14:09:05+05:30 IST