ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఆ కారు ఖమ్మం చేరింది!
ABN , First Publish Date - 2021-10-28T14:12:09+05:30 IST
గత నెల 31న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది...

- ‘సొంత వాహనంగా అంబులెన్స్’..
- కథనానికి అధికారుల స్పందన
ఖమ్మం కలెక్టరేట్: ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అంబులెన్స్‌ను హైదరాబాద్‌లో హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి కారుగా మార్చుకుని వినియోగిస్తున్నారంటూ గత నెల 31న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఇది డీఎంహెచ్‌వో కార్యాలయంలో కలకలం లేపింది. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ కారు వ్యవహారంపై ఆరా తీశారు. ఆ కారు (ఏపీ20టీసీ 2701) మంగళవారం ఖమ్మం డీఎంహెచ్‌వో కార్యాలయానికి చేరింది. మంగళవారం కారును హైదరాబాద్ నుంచి ఖమ్మం తీసుకొచ్చినట్లు జిల్లా అధికారులు తెలిపారు.