‘ప్రభుత్వాలు దళితులను మోసం చేస్తున్నాయి’
ABN , First Publish Date - 2021-02-26T06:03:06+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, గిరిజనులను మోసం చేస్తున్నాయని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక ఆరోపించింది.

పంజాగుట్ట, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, గిరిజనులను మోసం చేస్తున్నాయని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక ఆరోపించింది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, తొలగించిన ప్రాంతంలోనే అంబేడ్కర్ విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించాలని వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.విజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. నాను, ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్‌తో కలిసి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తమకే ఖర్చు చేయడంతోపాటు, బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీఎ్‌సఎన్‌ఎల్, బీహెచ్‌ఈఎల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తదితర సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో బడా సంస్థలకు కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నర్సింగరావును నియమించారు. సమావేశంలో వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.