మూడో రోజు అఖిలప్రియ కస్టడీ విచారణ ప్రారంభం

ABN , First Publish Date - 2021-01-13T16:55:46+05:30 IST

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిల ప్రియను మూడో రోజు పోలీసులు విచారిస్తున్నారు.

మూడో రోజు అఖిలప్రియ కస్టడీ విచారణ ప్రారంభం

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ అరెస్ట్ అయిన మాజీ మంత్రి అఖిల ప్రియను మూడో రోజు పోలీసులు విచారిస్తున్నారు. బేగంపేట్ మహిళా పోలీస్‌స్టేష్‌లో కస్టడీ విచారణ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుండి భూమా అఖిల ప్రియను  నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీ ల బృందం ప్రశ్నిస్తోంది. కిడ్నాపర్లతో భూమా అఖిల ప్రియ మాట్లాడిన కాల్స్‌పై పోలీసులు ప్రశ్నించనున్నారు. అలాగే పరారీలో ఉన్న గుంటూరు సీను, భార్గవ్ రామ్ ఎక్కడ ఉన్నారనే దానిపై  భూమా అఖిల ప్రియను ప్రశ్నించనున్నారు. టవర్ లోకేషన్, సిమ్ కార్డ్ నంబర్స్ , ఇతర ఆధారాలను ముందుంచి అఖిలప్రియను ప్రశ్నలు అడుగనున్నారు. కిడ్నాప్ ఎపిసోడ్‌లో భూమా విఖ్యాత్ పాత్ర‌పై ఆధారాలతో సహా పోలీసులు ప్రశ్నించనున్నారు. నేటి విచారణను పోలీసులు కీలకంగా భావిస్తున్నారు. 

Updated Date - 2021-01-13T16:55:46+05:30 IST