GHMC ఆఫీసులో బీజేపీ దాడి నేపథ్యంలో ఒక్కసారిగా మారిన సీన్..
ABN , First Publish Date - 2021-11-26T15:48:10+05:30 IST
బీజేపీ దాడి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ...

- మేయర్ పేషీ వద్ద పటిష్ఠ నిఘా
- సీసీ కెమెరాల ఏర్పాటు..
హైదరాబాద్ సిటీ : బీజేపీ దాడి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆఫీ్‌సలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు..? అన్నది గుర్తించేలా అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి, ఏడో అంతస్తులోని మేయర్ పేషీల వద్ద సీసీ కెమెరాలు గురువారం అమర్చారు. ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా మారిన నేపథ్యంలో కార్యాలయానికి వస్తోన్న వారి వివరాలను ఎక్కడికక్కడ రికార్డు చేసేలా చర్యలకు శ్రీకారం చుట్టారు.
మేయర్ పేషీలు ఉన్న మొదటి అంతస్తులో నాలుగు, ఏడో అంతస్తులో మూడు కెమెరాలు బిగించారు. వాటిని మేయర్ పేషీలోని అధికారుల కంప్యూటర్లకు అనుసంధానం చేయనున్నారు. ఫుటేజీ రికార్డు చేసేందుకు 6 టీబీ హార్డ్‌డిస్క్‌ను వినియోగిస్తున్నారు. కెమెరాల ఏర్పాటు, హార్డ్‌డి్‌స్కకు రూ.60 నుంచి 70 వేల వరకు ఖర్చవుతుందని ఓ అధికారి చెప్పారు.

