ABN-Andhrajyothy న్యూస్‌రీడర్‌కు పురస్కారం

ABN , First Publish Date - 2021-08-30T17:28:02+05:30 IST

ప్రముఖ న్యూస్‌ చానల్‌ ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ న్యూస్‌రీడర్‌ క్రాంతి

ABN-Andhrajyothy న్యూస్‌రీడర్‌కు పురస్కారం

హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి : ప్రముఖ న్యూస్‌ చానల్‌ ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ న్యూస్‌రీడర్‌ క్రాంతికి ‘న్యూస్‌రీడర్‌-2020’ ప్రతిభా అవార్డును ప్రదానం చేశారు. ఆరాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం త్యాగరాయగానసభలో నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజ్‌గిరి కోర్టు విశ్రాంత న్యాయమూర్తి బూర్గుల మధుసూదన్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా న్యూస్‌రీడర్లు వాటిని చదివే విధానం చక్కగా, ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. 


సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా ఆరాధన సంస్థవారు టీవీ చానల్‌ న్యూస్‌రీడర్‌లకు పురస్కారాలు ఇస్తూ ప్రోత్సహించడం ఎంతో ముదావహం అన్నారు. ఈ సందర్భంగా వివిధ చానల్‌ల న్యూస్‌రీడర్‌లకు పురస్కారాలు, సీనియర్‌ న్యూస్‌ రీడర్‌లకు స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. ఎస్‌బీఐ చీఫ్‌ అసోసియేట్‌ కోట విజయలక్ష్మి శెట్టి, డీ.ఎం.కె. రంగారెడ్డి, జి.హనుమంతరావు, చిల్లా రాజశేఖరరెడ్డి, నిర్వాహకులు లోకం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-30T17:28:02+05:30 IST