భాగ్యనగరంలో 97శాతం Vaccination పూర్తి..

ABN , First Publish Date - 2021-08-20T14:21:06+05:30 IST

వచ్చే నెల 9వ తేదీ వరకు నగరంలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడమే...

భాగ్యనగరంలో 97శాతం Vaccination పూర్తి..

హైదరాబాద్‌ సిటీ : హైదరాబాద్‌ జిల్లాలో 18ఏళ్లు పైబడిన వారికి 97శాతం మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. రెండో డోస్‌ 35శాతం పూర్తయింది. ప్రతిరోజూ 50 కేంద్రాల వద్ద సుమారు 15వేల మందికి వ్యాక్సిన్‌ వేస్తుండగా, 90 మొబైల్‌ వ్యాక్సిన్‌ వాహనాల ద్వారా మరో 20వేల మందికి వేస్తున్నారు. వచ్చే నెల 9వ తేదీ వరకు నగరంలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. ప్రస్తుతమున్న మొబైల్‌ వ్యాక్సిన్‌ వాహనాలను 150కు పెంచనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 18ఏళ్లు పైబడిన జనాభా 26,66,426 ఉండగా, మొదటి డోస్‌ను 25,96,143 మందికి వేయగా, రెండో డోస్‌ను 9,23,040 మందికి వేశారు.

Updated Date - 2021-08-20T14:21:06+05:30 IST