నా దారి రహదారి.. టూ వీలర్ బైక్.. 90 చలాన్లు.. 78 హెల్మెట్‌ లేనివే.!

ABN , First Publish Date - 2021-10-21T14:18:39+05:30 IST

హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతున్న వాహనదారుడిని ...

నా దారి రహదారి..  టూ వీలర్ బైక్.. 90 చలాన్లు.. 78 హెల్మెట్‌ లేనివే.!

హైదరాబాద్ సిటీ/రెజిమెంటల్‌బజార్‌ : హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతున్న వాహనదారుడిని ట్రాఫిక్‌ పోలీసులు ఆపి తనిఖీ చేయగా  సదరు వాహనంపై ఉన్న చలాన్ల జాబితా చూసి ఆశ్చర్యపోయారు. 90 పెండింగ్‌ చలాన్లు ఉండగా, అందులో 78 హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడపడం వల్ల విధించినవే. బుధవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ రోడ్డులో మహంకాళి ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల తనిఖీలలో భాగంగా (టీఎస్10ఈపీ0298) బైక్‌పై వెళ్తున్న యువకుడిని ఆపారు. స్టేటస్‌ చూడగా 90 చలాన్లు, రూ.32,960 జరిమానా పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ప్రాణ రక్షణ కోసం విధిగా హెల్మెట్‌ ధరించాలని ఎంత ప్రచారం చేసినా ఇలాంటి యువకులు మారడం లేదని ఎస్‌ఐ శంకర్‌నాయక్‌ విచారం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-21T14:18:39+05:30 IST