Roadపై వెళ్తుండగా 6 లక్షలున్న బ్యాగ్ దొరికింది.. ఈ చిరుద్యోగి ఏం చేశాడో చూడండి..!
ABN , First Publish Date - 2021-11-28T17:12:53+05:30 IST
బ్యాగును తెరచి చూడగా డబ్బు కనిపించింది. వెంటనే బ్యాగును...

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్ : రోడ్డుపై దొరికిన 6 లక్షల రూపాయలను ఠాణాలో అప్పగించి పెద్ద మనసు చాటుకొన్నాడు చిరుద్యోగి. కాటేదాన్ పోషక్ ఫుడ్‌లో సూపర్వైజర్గా పనిచేస్తున్న రణవీర్‌సింగ్ రూ.6 లక్షల 3వేలు బ్యాగులో పెట్టుకుని స్కూటీపై శనివారం పుష్టీ కంపెనీకి బయలుదేరాడు. మార్గమధ్యంలో బ్యాగు కిందపడిపోయింది. రణవీర్‌సింగ్ చూసుకోకుండా వెళ్లిపోయాడు. రోడ్డుపై వస్తున్న మిత్ర పాలిమేర్ కంపెనీలో పనిచేస్తున్న అశోక్ తివారీ గమనించి బ్యాగును తెరచి చూడగా డబ్బు కనిపించింది. వెంటనే బ్యాగును మైలార్దేవులపల్లి పోలీసులకు అప్పగించాడు. డబ్బులు పోయాయని రణవీర్‌సింగ్ పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. అప్పటికే స్టేషన్లో ఉన్న సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర డబ్బులు ఉన్న బ్యాగ్‌ను రణవీర్‌సింగ్‌కు అందజేశారు. దొరికిన డబ్బును పోలీసులకు అప్పగించిన అశోక్ తివారీని సీపీ, పోలీసులు అభినందించారు.
