Hyderabad : త్వరలో మరో 32 బస్తీ దవాఖానాలు
ABN , First Publish Date - 2021-10-28T16:32:20+05:30 IST
మహానగరంలో మరిన్ని బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయి....

హైదరాబాద్ సిటీ : మహానగరంలో మరిన్ని బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయి. నగరంలో ఇప్పటికే 226 బస్తీ దవాఖానాలు ఉండగా, త్వరలో మరో 32 ప్రారంభించనున్నట్టు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. దవాఖానాల్లో చికిత్సతో పాటు పరీక్షలు చేసేందుకు నమూనాలు సేకరించి ఐపీఎం, ఫీవర్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు పంపుతారు. అక్కడి నుంచి రిపోర్టులు తెప్పించి రోగులకు అందజేయనున్నారు.