సమస్యలపై ఏకరువు

ABN , First Publish Date - 2022-01-01T03:44:39+05:30 IST

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ అధ్యక్షతన శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీలు సమస్యలపై ఏకరువు పెట్టారు. ప్రజాప్రతినిధులతో అధికారులు వ్యవహరిం చిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కలెక్టర్‌, చైర్‌ప ర్సన్‌ల దృష్టికి తీసుకువెళ్లారు. సమావేశంలో సభ్యులు పలువురు అధికారుల తీరును ఎండగట్టారు.

సమస్యలపై ఏకరువు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరి

జిల్లా పరిషత్‌ సమావేశంలో అధికారుల తీరుపై నిలదీత

అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికి అందేలా చూడాలి 

జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరి 

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 31: జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ అధ్యక్షతన శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీలు సమస్యలపై ఏకరువు పెట్టారు. ప్రజాప్రతినిధులతో అధికారులు వ్యవహరిం చిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కలెక్టర్‌, చైర్‌ప ర్సన్‌ల దృష్టికి తీసుకువెళ్లారు. సమావేశంలో సభ్యులు పలువురు అధికారుల తీరును ఎండగట్టారు. మంచి ర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు  ఫోన్‌ చేసి నా స్పందించడం లేదని లక్షెట్టిపేట, దండేపల్లి జడ్పీ టీసీలు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. పేషెంట్‌ మృతి చెందిన విషయం గురించి వైద్యాధికారులకు ఫోన్‌ చేస్తే నిర్లక్ష్యంగా కట్‌ చేశారన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు, ప్రజాప్రతినిధులు అధికారులు జవాబు చె ప్పాలన్నారు. లక్షెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య మా ట్లాడుతూ సదరం సర్టిఫికెట్ల కుంభకోణంపై ‘ఆంధ్ర జ్యోతి’లో వచ్చిన కథనానికి  ఎందుకు విచారణ చేపట్ట లేదని ప్రశ్నించారు. ఆయా మండలాల్లో నెలకొన్న సమ స్యలపై సభ్యులు అధికారులను నిలదీశారు. లక్షెట్టిపేట, తాండూర్‌, దండేపల్లి తదితర ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించాలన్నారు. ఆహార భద్రత పథకంపై డీఆర్‌డీవో శేషాద్రి మాట్లాడుతూ జిల్లాలో ఆహార భద్రత చట్టం 2013 ఎన్‌ఎస్‌ఎస్‌ యాక్ట్‌ ప్రకా రం లబ్ధిదారులకు ప్రతీ నెల ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, 2లక్షల18వేల475 మందికి ప్రతీ నెల బియ్యం, సరు కులు పంపిణీ చేస్తున్నామన్నారు. జడ్పీటీసీ సత్తయ్య మాట్లాడుతూ పీడీఎస్‌ రైస్‌లో అవకతవకలు జరు గుతున్నాయని నిరుపేదలందరికి అందాల్సిన బియ్యం పక్కదారి పడుతుందని ఆరోపించారు. రైసుమిల్లర్లతో అధికారులు కుమ్మక్కయ్యారని, ఈ అంశంపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ స్పందిస్తూ  తగిన ఆధారాలతో అధికారుల దృష్టికి తీసుకువస్తే చర్య లు తీసుకుంటామన్నారు. టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ద్వారా అక్రమాలు జరగకుండా అప్రమత్తం చేశామని క్షేత్ర స్థాయిలో ఏమైనా జరిగితే ప్రత్యేక కమిటీని వేస్తా మన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ గొర్రెలపై జిల్లాలో ఎంత మందికి ఇచ్చారో లబ్ధిదారుల జాబితాను విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయకుండానే ఫొటోలు దిగుతూ ప్రచారానికి పరిమితమవుతున్నారని పలువురు  సభ్యు లు ప్రశ్నించారు. బెల్లంపల్లి, మంచిర్యాల ఎమ్మెల్యేలు చిన్నయ్య, దివాకర్‌రావులు మాట్లాడుతూ గొర్రెల అవక తవకలపై విచారణ చేపట్టాలని, అధికారులు అన్ని మండలాలు తిరిగి  పథకాన్ని పకడ్బందీగా అమలు పరచాలన్నారు. వ్యవసాయ శాఖలో విత్తనాలు సరిగ్గా ఇవ్వడం లేదని జడ్పీటీసీ వేల్పుల రవి, బానయ్యలు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. జడ్పీటీసీ  ఎర్ర చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కిష్టాపూర్‌  పాఠశాల లో 650 మంది విద్యార్థులకు 15 మంది ఉపాధ్యా యులు ఉండాల్సి ఉండగా 8 మంది ఉన్నారని, ముగ్గు రికి ఇంకా పోస్టింగ్‌ కూడా ఇవ్వలేదని, ఫలితాల్లో మొదటి స్థానంలో ఉన్న పాఠశాలకు ఉపాధ్యాయుల కొరత సరైంది కాదని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్‌ డీఈవోను సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ మధుసూ దన్‌నాయక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుం ట్ల ప్రవీణ్‌లు హాజరయ్యారు. 

సంక్షేమ పథకాలు అందరికి అందాలి : కలెక్టర్‌

అభివృద్ధి సంక్షేమ పథకాలు వందశాతం పూర్తి చేసేందుకు వేగంగా ముందుకు సాగాలని కలెక్టర్‌ భార తి హోళికేరి పేర్కొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా లో అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు, ప్రజాప్రతి నిధులు సమన్వయంగా పనిచేస్తూ లక్ష్యానికి చేరువ కావాలన్నారు. జిల్లాలో రైతులు ప్రత్యామ్నాయ పంట లపై దృష్టి సారించాలని సూచించారు.  

సమన్వయంతో పనిచేయాలి : జడ్పీచైర్‌పర్సన్‌  

జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో భాగస్వాములై సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ పేర్కొ న్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని, అభివృద్ధి పనుల ప్రోగ్రెస్‌ను వెంట వెంటనే అందేలా చూడాలన్నారు. జిల్లాకు మెడికల్‌ కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.   

పంట మార్పిడిపై అవగాహన అవసరం : ఎంఎల్‌సీ  

పంట మార్పిడి విధానంపై రైతులకు విస్తృతమైన అవగాహన కల్పించాలని ఉమ్మడి ఆదిలాబాద్‌ ఎం ఎల్‌సీ పురాణం సతీష్‌ పేర్కొన్నారు. రైతు సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు వేదికలను ఏర్పాటు  చేశారని అధికారులు వాటిని వినియోగించు కోవడంలో విఫలమవుతున్నారన్నారు.  పంట మార్పిడి అంశంపై ప్రత్యేకమైన అధికారులను ఏర్పాటు చేసి రైతువేదికల వద్ద అవగాహన కల్పించాలన్నారు. యా సంగి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేలా వ్యవహరిస్తున్న కేంద్రం ప్రభుత్వ తీరును రైతులకు వివరించాలన్నారు. రైతుబంధు, బీమా పథకా లతో కేసీఆర్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.

పథకాల అమలును పర్యవేక్షించాలి: ఎమ్మెల్యే దివాకర్‌రావు  

రైతులకు, గొల్లకుర్మలకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించాలన్నారు. క్లస్టర్‌ అధికారులు రైతు వేదికల వద్దకు వెళ్లి విత్తనాలు అందుబాటులో ఉన్న విషయాన్ని వివరించాలన్నారు. 

అధికారులు పనిచేయడం లేదు : ఎమ్మెల్యే చిన్నయ్య

పశుసంవర్ధక, అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గొర్రెలు, మేకల యూనిట్‌లను, గడ్డి కత్తిరించే యంత్రాలతో సహా సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తుండగా అధికారులు లబ్ధిదారులకు అందజేయ డంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎమ్మెల్యే చిన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్‌ భగీరథ, అటవీ శాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారు లతో ఓపికగా మాట్లాడి ఇబ్బందులు ఉంటే తొలగిం చాలని, లేదంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. 

ఎంఎల్‌సీ పురాణం సతీష్‌కు ఘన సన్మానం 

ఉమ్మడి ఆదిలాబాద్‌ ఎంఎల్‌సీ పురాణం సతీష్‌ పద వీకాలం జనవరి 4తో ముగుస్తుండడంతో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో కలెక్టర్‌ భారతి హోళి కేరి, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదె లు, అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఎంఎల్‌సీ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతిని ధులు, మీడియా ప్రోత్సహించారని, భవిష్యత్‌లో కూడా సేవలందిస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీసీఈవో నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ సత్యనారాయణ, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, డీపీఆర్‌వో సంపత్‌కుమార్‌, అధికారులు శేషాద్రి, నారాయణరావు, అరవింద్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-01T03:44:39+05:30 IST