ఐదుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ
ABN , First Publish Date - 2021-11-26T06:36:26+05:30 IST
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి గురువారం ఐదుగురు స్వతంత్ర ఎ మ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ప్ర కటించారు. ఇందులో మంచిర్యాల జిల్లాకు చెందిన జెక శేఖర్‌తో పాటు జన్నారం మండలం ఎండీ రియాజొద్దీన్, కడెం మండలం కట్టశ్యాంసుందర్, భైంసా మండలం అబ్దుల్ రజక్, గాజుల గంగాధర్ ఉండగా, జ న్నారం మండలానికి చెందిన గుండవరపు హారిణి తన ప్రతిపాదకుడు ఎస్.సాయికృష్ణగౌడ్‌తో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. దీంతో మరో 18 మంది ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. నామినేషన్ల ఉప సంహారణకు చివరి గడువు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగుస్తుందని తెలిపారు.

ఆదిలాబాద్, నవంబర్25 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి గురువారం ఐదుగురు స్వతంత్ర ఎ మ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ప్ర కటించారు. ఇందులో మంచిర్యాల జిల్లాకు చెందిన జెక శేఖర్‌తో పాటు జన్నారం మండలం ఎండీ రియాజొద్దీన్, కడెం మండలం కట్టశ్యాంసుందర్, భైంసా మండలం అబ్దుల్ రజక్, గాజుల గంగాధర్ ఉండగా, జ న్నారం మండలానికి చెందిన గుండవరపు హారిణి తన ప్రతిపాదకుడు ఎస్.సాయికృష్ణగౌడ్‌తో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. దీంతో మరో 18 మంది ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన వారిలో ఉన్నారు. నామినేషన్ల ఉప సంహారణకు చివరి గడువు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగుస్తుందని తెలిపారు.