తప్పుడు సంతకంతో నామినేషన్ విత్‌డ్రా
ABN , First Publish Date - 2021-11-27T05:24:13+05:30 IST
ఆదిలాబాద్ శాసన మండలి ఎ న్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సారంగాపూర్ జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. తాను నామినేషన్ విత్‌డ్రా చేసుకోలేదని ఎన్నికల కమిషన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదిలాబాద్ క లెక్టర్ కూడా ఆయన తన నామినేషన్ విషయంలో చర్యలు తీసుకొని అభ్యర్థిత్వాన్ని కొనసాగించాలని కోరారు. వివరాల్లోకి వెళ్తే.. టీఆర్‌ఎస్ పార్టీలోనే అసమ్మతి గళం వినిపించి నామినేషన్ వేసిన సారంగాపూర్ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ల ఉపసంహరణకు ముందే తన ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

నిర్మల్, నవంబరు26 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ శాసన మండలి ఎ న్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సారంగాపూర్ జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. తాను నామినేషన్ విత్‌డ్రా చేసుకోలేదని ఎన్నికల కమిషన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదిలాబాద్ క లెక్టర్ కూడా ఆయన తన నామినేషన్ విషయంలో చర్యలు తీసుకొని అభ్యర్థిత్వాన్ని కొనసాగించాలని కోరారు. వివరాల్లోకి వెళ్తే.. టీఆర్‌ఎస్ పార్టీలోనే అసమ్మతి గళం వినిపించి నామినేషన్ వేసిన సారంగాపూర్ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ల ఉపసంహరణకు ముందే తన ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నామినేషన్ల చివ రి రోజైన శుక్రవారం నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఎ న్నికల్లో పోటీ చేసిన సమయంలో తనను ప్రతిపాదించిన అభ్యర్థి ద్వా రా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి ఉపసం హరించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. తాను ఎ లాంటి సంతకాలు చేయలేదని, ఉపసంహరణ పత్రంపై తన సంతకం ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ రాజేశ్వర్ రెడ్డి హైదరాబాద్‌లో ఎన్నికల క మిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ శాసన సభ్యుడు గోనె ప్రకాష్ రావుతో కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అవుతోంది. మరోవై పు బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆదిలాబాద్ శాసన మండలి ఎన్నికల అభ్యర్థిగా రాజేశ్వర్ రెడ్డిని తాను పోటీలో ఉంచాలని పేర్కొంటూ చేసిన ప్రకటన టీవీల్లో ప్రసారం కావడం చర్చకు దారితీసింది. ఈ పరి ణా మాలు ఎటు దారితీస్తాయోనని రాజకీయవర్గాలు ఆసక్తితో ఉన్నాయి.