వన్యప్రాణులను సంరక్షించాలి
ABN , First Publish Date - 2021-02-07T04:28:01+05:30 IST
వన్య ప్రాణులను సంరక్షించాలని డిప్యూటీ రేంజ్ అధికారి ప్రతాప్ నాయక్ అన్నారు.

-డిప్యూటీ రేంజ్ అధికారి ప్రతాప్ నాయక్
సిర్పూర్(టి), ఫిబ్రవరి6: వన్య ప్రాణులను సంరక్షించాలని డిప్యూటీ రేంజ్ అధికారి ప్రతాప్ నాయక్ అన్నారు. శనివారం చీలపెల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ యాదగిరి బ్రహ్మయ్య చేతుల మీదుగా అటవీ శాఖాధికారులు పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులకు అగ్గి పెట్టడం వల్ల వన్యప్రాణులకు హాని కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీఓలు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ తదితరులు ఉన్నారు.