టీకా ఎప్పుడు?

ABN , First Publish Date - 2021-05-09T03:49:44+05:30 IST

కరోనా టీకాను ప్రభుత్వం నిలిపివేయడంతో లక్షలాది మంది యువత ఆందోళన చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తం గా జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటి దశలో వైద్య ఆరోగ్యశాఖలో టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించగా అంచెలం చెలుగా కరోనా సేవలందించిన ప్రభుత్వ శాఖల తోపాటు సామాన్య ప్రజలకు వేశారు.

టీకా ఎప్పుడు?

మొదటి డోసును నిలిపివేసిన ప్రభుత్వం

ఆస్పత్రుల్లో కేవలం రెండో డోసుకే పరిమితం
18-44 వయస్సు వారికి టీకా ఎన్నడో..?
మంచిర్యాల, మే 8 (ఆంధ్రజ్యోతి): కరోనా టీకాను ప్రభుత్వం నిలిపివేయడంతో లక్షలాది మంది యువత ఆందోళన చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తం గా జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటి దశలో వైద్య ఆరోగ్యశాఖలో టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించగా అంచెలం చెలుగా కరోనా సేవలందించిన ప్రభుత్వ శాఖల తోపాటు సామాన్య ప్రజలకు వేశారు. మొదట్లో టీకాపై అవగాహన లేకపోవడం, దుష్పలితాలు ఉం టాయనే భయంతో ప్రజలు వ్యాక్సినేషన్‌కు ముందుకు రాలేదు. క్రమంగా అవగాహన పెరగడంతో వ్యాక్సినే షన్‌ చేయించుకొనే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. మరోవైపు కరోనా రెండో దశ విజృంభించి పాజిటివ్‌ కేసులు పెరగడం, మరణాల సంఖ్య ఎక్కువగా  ఉం డటంతో ప్రజలు భయాందోళనకు గురై టీకా వేసు కొనేందుకు క్యూ కడుతున్నారు. వ్యాక్సినేషన్‌ వేసుకొనే వారి సంఖ్య పెరగడంతో కొరత ఏర్పడింది. దీంతో రోజువారీ టార్గెట్‌ ప్రకారం వ్యాక్సినేషన్‌ చేయాలని ప్రభుత్వాల నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్‌ రావడంతో తిరిగి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లో స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. 
నిలిచిపోయిన మొదటి డోసు...
ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు సరిపడా వ్యాక్సిన్‌లు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వం శనివారం నుంచి మొదటి డోసు టీకాలను పూర్తిగా నిలిపివేసింది. కేవలం రెండో డోసు మాత్రమే వేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొదటి డోసు వేసుకున్న వారికి మాత్రమే రెండో డోసు టీకాలు ఇస్తున్నారు. ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రకారం మొదటి డోసు వేసుకున్న తరువాత 28 నుంచి గరి ష్టంగా 40 రోజులలోపు రెండో డోసు తీసుకోవాలి. ఈ వ్యవధిని కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది.  మొదటి డోసులో ఏ కంపెనీ టీకా వేసుకుంటే రెండో డోసులోనూ అదే టీకాను తీసుకోవలసి ఉంటుంది. ఈ మేరకు మొదటి డోసు వేసుకున్న జిల్లా ప్రజలకు సరిపడా రెండో డోసు టీకాలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం నేరుగా వెళ్ళి ఆధార్‌, మొదటి డోస్‌ వేసుకున్న మెసేజ్‌ చూపిస్తే రెండో డోస్‌ వేస్తున్నారు. 
జిల్లాలో 94, 155 మందికి టీకాలు...
టీకా పంపిణీ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో  94,155 మందికి వ్యాక్సినేషన్‌ జరిగింది. ఇందులో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు ఉన్నాయి. మొదట్లో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ టీకాలు వేయగా జిల్లాలో 1725 మంది వ్యాక్సినేషన్‌ చేయించుకున్నారు. 13,332 మంది కొవాగ్జిన్‌ తీసుకోగా మిగతా వారికి కొవిషీల్డ్‌ వేశారు. టీకా వేయించుకున్న వారిలో 60 సంవత్స రాలు పైబడిన 39,902 మంది వ్యాక్సినేషన్‌ చేయిం చుకోగా 45-60 లోపు 51,824 మంది టీకా తీసుకు న్నారు. వీరిలో మొదటి డోసులో కొవాగ్జిన్‌ తీసుకున్న వారు 2760 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 18-45 సంవత్సరాల వారికి కూడా టీకాలు వేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆ వయస్సుగల వారు జిల్లాలో 3 లక్షల 20వేల వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే 45 సంవత్సరాల పైబడిన వారికి మొదటి డోసును నిలిపివేసిన ప్రభుత్వం మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో 18-44 లోపు యువతకు టీకాలు ఎప్పుడిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 
రెండో డోసుకు వ్యాక్సిన్‌ కొరతలేదు...
జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి ఫయాజ్‌ఖాన్‌
రెండో డోసు వేసుకొనే వారికి సరిపడా వ్యాక్సినేషన్‌ జిల్లాలో అందుబాటులో ఉంది. ఈ విషయమై ఆం దోళన చెందాల్సిన అవసరం లేదు. నిర్ణీత వ్యవధి తరు వాత రెండో డోసు వేసుకోవాలనుకునే వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవలసి ఉంటుంది. స్లాట్‌ బుకింగ్‌ ప్రకారం రెం డో డోసును ప్రజలు ఎలాంటి సందేహాలు లేకుండా తీసుకోవచ్చు. వారికి అవసరమైన నిల్వలు ఉన్నాయి.  

Updated Date - 2021-05-09T03:49:44+05:30 IST