జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
ABN , First Publish Date - 2021-11-06T03:52:48+05:30 IST
జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.

ఆసిఫాబాద్ రూరల్, నవంబరు 5: జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ విశేషకృషి చేస్తున్నార న్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరి గెల నాగేశ్వర్‌రావు, ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, పీఏసీఎస్‌చైర్మన్ అలీబీన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
సంస్కృతీ సంప్రదాయలను పరిరక్షించాలి..
సిర్పూర్(యూ): ఆదివాసీల సంస్కృతీ, సంప్రదా యలు ఎంతో ప్రాచీనమైనవని వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శుక్రవారం మండలంలోని పిట్టగూడ,చిలాటిగూడ గ్రామాల్లో దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు ఆయా గ్రామల్లోని దండారి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనకయాదవరావు, జైనూర్ మార్కెట్‌చైర్మన్ ఆత్రం భగవంతరావు, ఎంపీపీ తోడసం భాగ్యలక్ష్మీ, వైస్ ఎంపీపీ ఆత్రం ప్రకాష్‌రాజా, సర్పంచులు పెందొర్ నాగోరావు, కోవ భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.