సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

ABN , First Publish Date - 2021-10-20T04:26:11+05:30 IST

ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు అన్నారు.

సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
సమావేశంలో మాట్లాడుతున్న ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు

- ట్రాస్మా జిల్లా  అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు
కౌటాల, అక్టోబరు 19: ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని ట్రాస్మా జిల్లా  అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు అన్నారు. మండల కేంద్రంలో ఓ పాఠశాలలో మంగళవారం  కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, సిర్పూర్‌(టి) మండలాల ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబరు నుంచి పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను కరస్పాండెండ్లు అధ్యక్షుడికి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామన్నారు.  కార్యక్రమంలో కౌటాల మండలాధ్యక్షుడు గోపాల్‌, ఉపాధ్యక్షుడు తిరుపతి, కరస్పాండెంట్లు సంతోష్‌, ఓం ప్రకాష్‌, ప్రేంసార్‌, తులసీరాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:26:11+05:30 IST