పొదుపు సంఘాలతో ధాన్యం కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2021-05-06T04:06:38+05:30 IST

ప్రతి సంవత్సరం వ్యవ సాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఎల్కపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పొదుపు సంఘాలు(ఐకేపీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు అదనపుకలెక్టర్‌ రాజేశం అన్నారు.

పొదుపు సంఘాలతో ధాన్యం కొనుగోలు చేస్తాం
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రాజేశం

- అదనపు కలెక్టర్‌ రాజేశం

పెంచికలపేట, మే 5: ప్రతి సంవత్సరం వ్యవ సాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఎల్కపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పొదుపు సంఘాలు(ఐకేపీ) ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు అదనపుకలెక్టర్‌ రాజేశం అన్నారు. గత సంవత్సరం వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చిన కేంద్రంలో అవకతవకలు జరిగాయన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో కలిసి విచారణ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం అవకతవకలు జరగడం, అలాగే కొద్ది రోజుల క్రితం వరి కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ప్రోటోకాల్‌ పాటించడంలో నిర్వాహకులు నిర్లక్ష్యం వహిండంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దళారు లను నమ్మి మోసపోవద్దని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామన్నారు.

సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామికుమార్‌, ఎంపీపీ సుజాత, జడ్పీటీసీ సరిత, తహసీల్దార్‌ అనంతరాజ్‌, ఎంపీ డీవో శ్రీనివాస్‌, సర్పంచ్‌లు శ్రీనివాస్‌, సంజీవ్‌  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-06T04:06:38+05:30 IST