10 నుంచి కడెం ఆయకట్టుకు నీటి విడుదల

ABN , First Publish Date - 2021-12-31T06:29:16+05:30 IST

కడెం ప్రాజెక్టు ఆయకట్టుకు జనవరి 10వ తేదీ నుంచి నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతుల సమావేశంలో అధికారులు నిర్ణయించారు.

10 నుంచి కడెం ఆయకట్టుకు నీటి విడుదల
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌

ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలన్న అధికారులు

కుడి కాల్వ ద్వారా నీరందడం లేదని అధికారులను నిలదీసిన బెల్లాల్‌ రైతులు

ఖానాపూర్‌, డిసెంబరు 30 : కడెం ప్రాజెక్టు ఆయకట్టుకు జనవరి 10వ తేదీ నుంచి నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతుల సమావేశంలో అధికారులు నిర్ణయించారు. గురువారం జిల్లాలోని కడెంలో ఆయకట్టు రైతాంగ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ప్రాజెక్టు ఈఈ రాజశేఖర్‌లతో పాటు ఆయకట్టు మండలాల రైతులు పాల్గొన్నారు. అందరితో చర్చించిన అనంతరం జనవరి 10వ తేదీ నుంచి వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేయాలని సూచించారు. రైతులు కేవలం ఆరుతడి పంటలను మాత్రమే వేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా కొంతమంది రైతులు తాము వరి వేసుకుంటామని అధికారులతో చెప్పగా.. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తమకు ఆరుతడి పంటలకే నీటిని విడుదల చేయాలనే ఆదేశాలున్నాయని స్ప ష్టం చేశారు. మరోవైపు.. ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న తమ గ్రామానికి నీరు అందడం లేదని బెల్లాల్‌ గ్రామస్థులు అధికారులను నిలదీశారు. గ్రామంలోని చె రువుకు ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా నీటిని అందజేస్తారని.. ప్రస్తుతం ఆ కాల్వ దెబ్బతిందన్నారు. స్పందించిన ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ వెంటనే క్వాలకు మరమ్మతులు జరిపించి.. ప్రతి ఎకరాకూ నీరందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2021-12-31T06:29:16+05:30 IST