భీమన్న దేవుడికి జలాభిషేకం

ABN , First Publish Date - 2021-02-27T06:10:26+05:30 IST

మండలంలోని రాజూర గ్రామంలో శుక్రవారం తమ ఆరాధ్యదైవమైన భీమన్న దేవుడికి గంగస్నానం, జలా భిషేకం, ఊరేగింపు నిర్వహించి పూజలు చేశారు.

భీమన్న దేవుడికి జలాభిషేకం
ఊరేగింపు నిర్వహిస్తున్న దృశ్యం

ఖానాపూర్‌ రూరల్‌, ఫిబ్రవరి 26: మండలంలోని రాజూర గ్రామంలో శుక్రవారం తమ ఆరాధ్యదైవమైన భీమన్న దేవుడికి గంగస్నానం, జలా భిషేకం, ఊరేగింపు నిర్వహించి పూజలు చేశారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం జాతర, స్వామివారికి అలంకరణ, బండారుచే నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేసున్నామని సర్పంచ్‌ చిన్నం లావణ్య రవీందర్‌ తెలిపారు.

Updated Date - 2021-02-27T06:10:26+05:30 IST