జిల్లాలో సంక్రాంతి సందడి

ABN , First Publish Date - 2021-01-14T04:56:29+05:30 IST

జిల్లాలో సంక్రాంతి సంద డి నెలకొంది. ఈ పండుగను తెలుగు రాష్ర్టాల్లో ఎంతో గొప్ప గా మూడురోజుల పాటు జరుపుకుంటారు. ఇందులో భాగం గా సంక్రాంతికి సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం వారి వారి సొంత గ్రామాలకు చేరుకున్నారు.

జిల్లాలో సంక్రాంతి సందడి
రంగుల ముగ్గులు కొనుగోలు చేస్తున్న మహిళలు

వాకిళ్లలో అందమైన రంగవల్లులు 

పిండి వంటల తయారీలో మహిళలు

గ్రామాల్లో హరిదాసుల గానాలు 

గంగిరెద్దుల విన్యాసాలు

మార్కెట్‌లో పతంగులు, ముగ్గుల కొనుగోళ్లు

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 13: జిల్లాలో సంక్రాంతి సంద డి నెలకొంది. ఈ పండుగను తెలుగు రాష్ర్టాల్లో ఎంతో గొప్ప గా మూడురోజుల పాటు జరుపుకుంటారు. ఇందులో భాగం గా సంక్రాంతికి సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం వారి వారి సొంత గ్రామాలకు చేరుకున్నారు. ప్రస్తుతం జిల్లాలోని మార్కెట్లకు పండగ కళ వచ్చింది. పల్లెలు, పట్టణాలు అనేతేడా లేకుండా ఇళ్లల్లో పిండి వంటల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. అలాగే ఇంటి ముందు రంగవల్లులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, పతంగులకు మారుపేరు సంక్రాతి. అలాగే గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల గానాలు ఎంతగానో పరవశింప చేస్తున్నాయి. సంక్రాంతి పండుగను బుధవారం బోగితో ప్రారంభించిన ప్రజలు ఆనందోత్సాల్లో మునిగి తేలుతున్నారు. తమ ఇళ్లలో ముత్తయిదువులకు ఇచ్చుకునే నోములను సైతం పట్టణంలో కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. పండుగ సందర్భంగా నోములు, రంగు రంగుల ముగ్గులు, పతంగులను కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలు, చిన్నారులు, మహిళలతో పట్టణమంతా సందడిగా మారరింది. ఒకవైపు చిన్నారులు తమ ఇళ్ల దాబాలపై రంగు రంగుల పతంగులు ఎగురవేస్తూ కేరింతలు కొడుతుండగా.. మరోవైపు యువతులు తమ ఇళ్ల ముందు వేసిన రంగు రంగుల ముగ్గులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ప్రతీ వీధిలోనూ పిండి వంటలు గుమగుమలాడుతున్నాయి. 

Updated Date - 2021-01-14T04:56:29+05:30 IST