అటవీ అధికారుల పనులు అడ్డుకున్న గ్రామప్రజలు

ABN , First Publish Date - 2021-06-23T05:29:45+05:30 IST

ఖానాపూర్‌ మం డలంలోని బీర్నంది గ్రామ పంచాయతీ పరిధిలోని రంగపేట శివారులో గల అటవీప్రాంతంలో మంగళ వారం మొక్కలు నాటేందుకు భూమి చదును చేస్తుండగా గ్రామప్రజలు అడ్డుకున్నారు.

అటవీ అధికారుల పనులు అడ్డుకున్న గ్రామప్రజలు
ట్రాక్టర్‌ను అడ్డుకుంటున్న గ్రామస్థులు

ఖానాపూర్‌ రూరల్‌, జూన్‌ 22 : ఖానాపూర్‌ మం డలంలోని బీర్నంది గ్రామ పంచాయతీ పరిధిలోని రంగపేట శివారులో గల అటవీప్రాంతంలో మంగళ వారం మొక్కలు నాటేందుకు భూమి చదును  చేస్తుండగా గ్రామప్రజలు అడ్డుకున్నారు.  హరిత హారం కార్యక్రమంలో బాగంగా మొక్కలు నాటేందు కు ట్రాక్టర్‌ ద్వారా భూమిని దున్నుతుండగా విష యం తెలుకున్న గ్రామస్థులు అక్కడికి వెళ్లి పనులను అడ్డుకున్నారు. దాదాపు 25 ఎకరాల్లో ఉన్న అటవీ భూమిలో మొక్కలు నాటేందుకు, నర్సరీ ఏర్పాటుకు పనులు చేయిస్తున్నామని ఎఫ్‌ఆర్‌వో వినాయక్‌ తెలిపారు. అయితే ఈ స్థలంలో పురాతన కాలం నుండి గ్రామ అవసరాల నిమిత్తం పశువుల మందో ట, వరి కొనుగోలు కేంద్రంతో పాటు ఇతర గ్రామ అవసరాల నిమిత్తం ఈ స్థలం వినియోగిస్తున్నామని, ప్రస్తుతం వేరే చోటు లేదని, ఇందులో మొక్కలు నాటటం నిలిపివేయాలని గ్రామపెద్దలు కోరారు. అటవీశాఖకు చెందిన స్థలం అని మొక్కలు నాటుతా మని అధికారులు చెప్పారు. ఈ విషయమై వాగ్వి వాదం జరిగింది. జిల్లా అధికారులకు తెలియ జేస్తామని ప్రస్తుతం పనులు నిలిపివేస్తున్నస్తున్నట్లు ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ సాంబయ్య, బీట్‌ ఆఫీ సర్‌ యోగేష్‌, బేస్‌ క్యాంపు సిబ్బంది చెప్పారు. దీంతో గొడవ సద్దుమనిగింది. 


Updated Date - 2021-06-23T05:29:45+05:30 IST