సమస్యల వలయంలో పశువైద్యశాల

ABN , First Publish Date - 2021-10-15T05:29:25+05:30 IST

కెరమెరి మండల కేంద్రంలోని పశువైద్యశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీంతో మండలంలోని రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

సమస్యల వలయంలో పశువైద్యశాల
కెరమెరిలో పశువైద్యశాల

- శిథిలావస్థలో భవనం

- ఇన్‌చార్జి డాక్టరే దిక్కు

కెరమెరి, అక్టోబరు 14: కెరమెరి మండల కేంద్రంలోని పశువైద్యశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీంతో మండలంలోని రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పుడో నిర్మించిన పురాతనకాలం నాటి కాలం చెల్లిన భవ నంతో పశువైద్యసిబ్బందితో పాటు పశువుల యజమానులు అనేక అవస్థలు పడుతున్నారు. సరిపడా సిబ్బంది సైతం లేక పోవడంతో ఉన్న ఒక రిద్దరిపైనే పని భారం పడుతోంది. శిథిలావ స్థకు చేరిన భవనం ఏ క్షణాన కూలిపోతుందో తెలియక సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తు న్నారు. అయినా పాల కులు, అధికారుల్లో మాత్రం చలనం కని పించడం లేదు. అర కొర గదులతో మందు లను నిలువ చేయా లన్నా, సిబ్బంది ఉండాలన్నా ఇబ్బందికరంగా ఉంటోంది. చిన్నపాటి వర్షానికే పైకప్పు ఊరుస్తుండడంతో వర్షాకాలంలో నానా తంటాలు పడుతున్నారు. ఇక్కడ వైద్యాధికారి లేకపోవడంతో ఆసి ఫాబాద్‌ మండలం చిర్రకుంట పశువైద్యాధికారి ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో పశువులకు వైద్యం అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

జాడలేని సబ్‌ సెంటర్లు..

పాడి రైతులకు అందుబాటులో పశువైద్యశాల ఉండాలన్న లక్ష్యంతో మండలంలోని గోయగాం, అనార్‌పల్లి, కేలి(బి) గ్రామాల్లో సబ్‌సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చారు. కానీ నేటికీ ఆచరణలో పెట్టకపోవడంతో రైతులకు తమ పశువులకు ఏ చికిత్సలు చేయించాలన్నా మండల కేంద్రంలోని పశువైద్యశాలకు రావాల్సిన పరిస్థితులు నెల కొన్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి సబ్‌సెంటర్లను ఏర్పాటు చేయాలని, సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలని రైతులు కోరుతున్నారు.

సమస్యలను పరిష్కరించాలి..

- శ్రీకాంత్‌, రైతు, కెరమెరి

పశువైద్యశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. భవనం శిథిలావస్థకు చేరుకుంది. నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. అలాగే రైతులకు అందుబాటులో ఉండేలా సబ్‌సెంటర్లను ఏర్పాటు చేయాలి. వెంటనే ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి.

Updated Date - 2021-10-15T05:29:25+05:30 IST