ఖుర్షిద్‌నగర్‌లో కూరగాయల మార్కెట్‌

ABN , First Publish Date - 2021-05-20T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణంలోని హోల్‌సెల్‌ కూరగాయల మార్కెట్‌ను స్థానిక ఖుర్షీద్‌నగర్‌లోని మున్సిపల్‌ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయనున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కూరగాయల హోల్‌సెల్‌ వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు.

ఖుర్షిద్‌నగర్‌లో కూరగాయల మార్కెట్‌
సమావేశంలో మాట్లాడుతున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డేవిడ్‌

ఆదిలాబాద్‌టౌన్‌, మే20: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పట్టణంలోని హోల్‌సెల్‌ కూరగాయల మార్కెట్‌ను స్థానిక ఖుర్షీద్‌నగర్‌లోని మున్సిపల్‌ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయనున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కూరగాయల హోల్‌సెల్‌ వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఉదయం పూట కూరగాయల వ్యాపారులు గుంపులు గా ఉండడం గమనించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే యథావిధి స్థానంలో వ్యాపారం కొనసాగించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే రైతుబజార్‌ను మూసివేసి డైట్‌ గ్రౌండ్‌లో కూరగాయల వ్యాపారం కొన సాగించామని తెలిపారు. ఈ సమావేశంలో హోల్‌సెల్‌ కూరగాయల వ్యాపారులు హాజరయ్యారు. వారికి లాటరీ పద్ధతిలో తాత్కాలికంగా దుకాణాలను కేటాయించామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వినోద్‌కుమార్‌, డీఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, సహాయ కమిషనర్‌ రాజు, మున్సిపల్‌ సిబ్బంది, హోల్‌సెల్‌ వ్యాపారస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-20T05:30:00+05:30 IST