ప్రతీ ఒక్కరికి టీకా తప్పనిసరి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-12-07T05:34:44+05:30 IST

జిల్లాలో ప్రతీఒక్కరికి టీకా తప్పని సరిఅని అందరువ్యాక్సినేషన్‌చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని సంజయ్‌నగర్‌, న్యూహౌజింగ్‌బోర్డు కాలనీలోని ఆదిత్యనగర్‌లో నిర్వహించిన ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆమె సందర్శించి పరిశీలించారు.

ప్రతీ ఒక్కరికి టీకా తప్పనిసరి : కలెక్టర్‌
తోషంలో వైద్య సిబ్బందికి సూచనలు ఇస్తున్న డీఎంహెచ్‌వో

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6: జిల్లాలో ప్రతీఒక్కరికి టీకా తప్పని సరిఅని అందరువ్యాక్సినేషన్‌చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని సంజయ్‌నగర్‌, న్యూహౌజింగ్‌బోర్డు కాలనీలోని ఆదిత్యనగర్‌లో నిర్వహించిన ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆమె సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇప్పటికి వ్యాక్సిన్‌ వేసుకోలేని వారితో మాట్లాడి వ్యాక్సిన్‌పై ఉన్న భయాలు, అపోహలను విడనాడాలని వారికి సూచించారు.  

జిల్లాలో కరోనా కేసులు నిల్‌

జిల్లాలో సోమవారం కరోనా కేసులు నమోదు కాలేదని, నిల్‌ ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 314 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో 8మంది హోంఐసోలేషన్‌లో, ముగ్గురు రిమ్స్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఒమైక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం చూపనున్న క్రమంలో ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, శానిటైజర్‌ వినియోగించాలని కోరారు. ముఖ్యంగా స్కూల్‌కు, కళాశాలలకు వెళ్లే పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. 

గుడిహత్నూర్‌: అర్హులందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని డీఎంహెచ్‌వో రాథోడ్‌ నరేందర్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం గుడిహత్నూర్‌ తోషం గ్రామాల్లో ఇంటింటికీ వైద్య సిబ్బంది వేస్తున్న వ్యాక్సిన్‌ తీరును వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యాక్సిన్‌ తోనే ప్రజలకు భద్రత లభిస్తుందన్నారు. రెండో డోసులు పూర్తయితేనే కరోనా భారీన పడకుండా ఉంటామన్నారు. కొత్తరకం వేరియంట్‌ వస్తున్నందున ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్కు లేకుండా బయటకు రావొద్దన్నారు. ఇందులో ఎంపీడీవో సునీత, మెడికల్‌ ఆఫీసర్‌, నీలోఫర్‌, ఎంపీవో లింగయ్య, తదితరులున్నారు. 

బోథ్‌: మండలంలో కొవిడ్‌ టీకా వేసే కార్యక్రమం ఊపందుకుంది. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి టీకాలు వేస్తున్నారు. మూడు రోజుల్లో వ్యాక్సిన్‌ పూర్తి చేయాలన్న సంకల్పంతో కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. బోథ్‌లో సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ప్రకాష్‌, ఈవో అంజయ్యలు వైద్య సిబ్బంది వెంట ఉండి పర్యవేక్షించారు. గుత్పాల తాండలో 102ఏళ్ల వృద్ధురాలికి డాక్టర్‌ నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం అనసూయ టీకాలు వేశారు.  

జైనథ్‌: ఒమైక్రాన్‌ ఉధృతి నేపథ్యంలో ప్రతీ ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని రూరల్‌ సీఐ కోట్నాక్‌ మల్లేష్‌ అన్నారు. సోమవారం మండలలోని దీపాయిగూడ, జైనథ్‌ తదితర గ్రామాల్లో మండల పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జగదీశ్‌గౌడ్‌, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ ఎస్‌.లింగారెడ్డి, సర్పంచ్‌లు డి.దేవన్న, బొల్లిగంగన్నలతో పాటు ఆయా గ్రామాలవారు ఉన్నారు.

Updated Date - 2021-12-07T05:34:44+05:30 IST