నిరుపయోగంగా ప్రయాణ ప్రాంగణం

ABN , First Publish Date - 2021-12-20T03:54:40+05:30 IST

అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృథా అవు తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం మండల కేంద్రంలో నిర్మించిన ప్రయాణప్రాంగణం ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.

నిరుపయోగంగా ప్రయాణ ప్రాంగణం
వాంకిడిలో నిరుపయోగంగా ఉన్న ప్రయాణప్రాంగణం

వాంకిడి, డిసెంబరు 19: అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృథా అవు తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం మండల కేంద్రంలో నిర్మించిన ప్రయాణప్రాంగణం ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. 1995లో రూ.4లక్షలతో ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించారు. గ్రామానికి దగ్గరలో కాకుండా అరకిలోమీటరు దూరంలో నిర్మించడంతో ప్రయాణికులు అక్కడికి వెళ్లడం లేదు. దీంతో ప్రయాణికులు లేక బస్సులు రాక ప్రయాణప్రాంగణం నిరుపయోగంగా యాచకులకు నిలయంగా మారింది. దాదాపు 26ఏళ్ల కిందట నిర్మిం చిన ఈ ప్రయాణప్రాంగణంపై ఇప్పటివరకు ఆర్టీసీ అధికారులు శ్రద్ధ వహిం చకపోవడంపై ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు. ప్రయాణ ప్రాంగణాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని అనేకసార్లు ఆర్టీసీ అధికారులకు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోతోందని స్థానికులు పేర్కొంటు న్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రయాణ ప్రాంగణాన్ని ఉపయో గంలోకి తీసుకువచ్చి ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. 

ప్రయాణికులకు తప్పనిపాట్లు..

మండల కేంద్రంలో రోడ్డు పక్కన ఆర్టీసీ బస్సులను నిలిపివేస్తున్నారు. అక్కడ ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. మండలకేంద్రం నుంచి నిత్యం వందలాది మంది ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కాగజ్‌నగర్‌, కరీంనగర్‌, మహారాష్ట్రలోని రాజుర, బాల్లార్షా, చంద్రపూర్‌ పట్టణాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం రోడ్డు పక్కన బస్సులు నిలిపేస్థలంలో నిలువ నీడలేకపోవడంతో వర్షాకాలం, ఎండకాలంలో ప్రయాణికులు తీవ్రఇబ్బందులకు గురికావల్సి వస్తోంది. బస్సుల కోసం చెట్లకిందా, దుకాణాలు, హోటళ్లవద్ద వేచి ఉండాల్సిన పరిస్థతి ఏర్పడుతోంది. 

ప్రయాణికుల సౌకర్యంపై శ్రద్ధవహించడంలేదు..

ఆర్టీసీ అధికారులు ఆదాయంపై చూపిస్తున్న శ్రద్ధ సౌకర్యాల కల్పనపై చూపించడంలేదు. దాదాపు 26ఏళ్ల క్రితం నిర్మించిన ప్రయాణ ప్రాంగణాన్ని ఇంతవరకు ఉపయోగంలోకి తీసుకురాలేదంటే ఆర్టీసీ అధికారుల శ్రద్ధ ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ప్రయాణప్రాంగణాల ఏర్పాటు, తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఇలాంటి వాటికి ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ప్రయా ణికుల నుంచి ఒక శాతం సెస్సు రూపేణా అదనంగా వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకుగాను వెచ్చించాల్సి ఉంటుంది. కాని ఏళ్లు గడుస్తున్నా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రయాణప్రాంగాణాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. 

బస్టాండ్‌ను ఉపయోగంలోకి తీసుకురావాలి..

ఆరిఫ్‌ హుస్సేన్‌ -వాంకిడి

మండల కేంద్రంలో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌ అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. 26సంవత్సరాల నుంచి ఈ బస్టాండ్‌లో బస్సులు రాకపోవడం, ప్రయాణికులు లేకపోవడంతో యాచకులకు నీలయంగా తయారైంది. ప్రస్తుతం జాతీయ రహదారి పక్కన బస్సులు నిలుపుతుండడంతో  వేసవి, వర్షాకాలంలో హోటళ్లు, షెడ్లు, కిరాణాదుకాణాలు, చెట్ల కిందా ప్రయాణికులు వేచి ఉంటున్నారు. ఆర్టీసీ అధికారులు తక్షణమే బస్టాండ్‌ను ఉపయోగంలోకి తీసుకువ చ్చి ప్రయాణికులకు సదుపాయాలు కల్పించాలి.

Updated Date - 2021-12-20T03:54:40+05:30 IST