కోలుకోని వరద బాధితులు

ABN , First Publish Date - 2021-07-25T04:15:11+05:30 IST

ఎన్‌టీఆర్‌నగర్‌, పద్మశాలినగర్‌, రామ్‌నగర్‌ కాలనీలలో వరద బాధితులు ఇంకా కోలుకోలేదు. ఇండ్లలో పేరుకుపోయిన మట్టిని శుభ్రపర్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కోలుకోని వరద బాధితులు
వరద నీరు చేరడంతో శుభ్రం చేసుకుంటున్న బాధితులు

 ఏసీసీ, జూలై 24 : ఎన్‌టీఆర్‌నగర్‌, పద్మశాలినగర్‌, రామ్‌నగర్‌ కాలనీలలో వరద బాధితులు ఇంకా కోలుకోలేదు. ఇండ్లలో పేరుకుపోయిన మట్టిని శుభ్రపర్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బియ్యం,  నిత్యావసర సరుకులు బురదనీటితో పాడైపోయాయి. బట్టలు, టీవీ, ఫ్రిడ్జ్‌ తదితర సామగ్రి పాడైపోయి నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభు త్వం ఆదుకోవాలని కోరారు. అధికారులు పరామర్శించి వెళ్ళారే తప్ప ఆహారాన్ని కూడా అందించలేదని ఆక్రో శం వెళ్ళగక్కారు. 

బాధితులను పరామర్శించిన ట్రైనీ కలెక్టర్‌ 

భీమారం : ఇటీవల కురిసిన వర్షాలతో ఇండ్లలోకి నీరు రావడంతో  ఇబ్బందులు పడుతున్న పోలంపల్లి లోని మూడు కుటుంబాలకు పాఠశాలలో పునరావా సం కల్పించగా శనివారం ట్రైనీ కలెక్టర్‌ ప్రతిభాసింగ్‌ బాధితులను పరామర్శించారు. అన్ని సౌకర్యాలను కల్పి స్తామని, అధైర్యపడవద్దని సూచించారు. తహసీల్దార్‌ జ్యోత్స్న, ఆర్‌ఐఅరుణ, వీఆర్‌ఏ లు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-07-25T04:15:11+05:30 IST