ఉమ్రి(కే) ప్రకృతివనాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-08-10T07:32:18+05:30 IST

మండలంలోని ఉమ్రి(కే) గ్రామంలో సోమవారం కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కాడేలు పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు.

ఉమ్రి(కే) ప్రకృతివనాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
ఉమ్రి(కే)లో పల్లె ప్రకృతివనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ ముషారఫ్‌అలీఫారూఖీ

తానూర్‌, ఆగస్టు 9 : మండలంలోని ఉమ్రి(కే) గ్రామంలో సోమవారం కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కాడేలు పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకృతివనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్‌ జిల్లాలోనే ఉమ్రి(కే) ప్రకృతివనం ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. గ్రామసర్పంచ్‌ రత్న మాల, ఎంపీడీవో శ్రీనివాస్‌, గ్రామ కార్యదర్శి వినయ్‌లు ఐక్యంగా కష్టపడడంతోనే ఇది సాధ్యమైందన్నారు. మంచి ప్రణాళికతో పనులు చేయడం వలన ప్రకృతి వనాన్ని మొక్కలతో అందంగా తీర్చిదిద్దారని, గ్రామసర్పంచ్‌, గ్రామకార్యదర్శులను మెచ్చుకొని స్వాతంత్య్ర దినోత్సవన సర్పంచ్‌కు రూ.15వేల బహుమతి, గ్రామ కార్యదర్శికి రూ. 10వేల బహుమతిగా మంత్రి, ఉన్నతాధికారుల చేతుల మీదుగా అందించనున్నట్లు ప్రకటించారు. అదనపు కలెక్టర్‌ హెమంత్‌బోర్కాడే మాట్లాడు తూ అధికారులు ప్రజాప్రతినిధులు ఒకరొకరు సహకరించుకుంటూ పనులు చేస్తే మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీని వాస్‌, తహసీల్దార్‌ వెంకటరమణ, ఎంపీవో మోహన్‌సింగ్‌, ఆత్మచైర్మన్‌ పోతా రెడ్డి, వైస్‌ ఎంపీపీ చంద్రకాంత్‌, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, ముథోల్‌ నియో జక వర్గ మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, తానూర్‌ మండల ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-10T07:32:18+05:30 IST