భూ నిర్వాసితులు సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-02-27T04:03:29+05:30 IST

సింగరేణి యజమాన్యం కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను భూ నిర్వాసితులు సద్వినియోగం చేసుకో వాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, సింగరేణి డైరెక్టర్‌ ప్రాజెక్టు ప్లానింగ్‌ బలరాం అన్నారు.

భూ నిర్వాసితులు సద్వినియోగం చేసుకోవాలి
నియామకపత్రాలను అందజేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి

- కుమరం భీం జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి
రెబ్బెన, ఫిబ్రవరి 26: సింగరేణి యజమాన్యం కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను భూ నిర్వాసితులు సద్వినియోగం చేసుకో వాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, సింగరేణి డైరెక్టర్‌ ప్రాజెక్టు ప్లానింగ్‌ బలరాం అన్నారు. శుక్రవారం గోలేటి టౌన్‌షిప్‌లో చేపట్టిన ఉద్యోగ నియామకపత్రాల అందజేత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వారు మాట్లాడారు. జీవో ఎంఎస్‌ 34 ప్రకారం గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సారి సింగరేణిలో భూములు కోల్పోయిన వారి పిల్లలకు పర్మనెంట్‌ ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పారు. బెల్లంపల్లి ఏరియాలో 205 మందిని అర్హులుగా గుర్తించారని అన్నారు. ఇప్పటి వరకు 142 మందికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించామన్నారు. అందులో 61 మందికి ప్రస్తుతం పర్మనెంట్‌ ఉద్యోగ నియామక పత్రాలు అంద జేశామని తెలిపారు కార్యక్రమంలో జీఎం ఎస్టేట్‌ సుభానీ, జీఎం పర్సనల్‌ ఆనందరావు, జీఎం బెల్లంపల్లి సంజీవరెడ్డి, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, పర్సనల్‌ మేనేజర్‌ లక్ష్మణ్‌ రావు, డీవైపీఎం రామశాస్త్రీ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వనజ, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంజీవ్‌, సర్పంచ్‌ సుమలత పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:03:29+05:30 IST