టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదులో ముందుండాలి

ABN , First Publish Date - 2021-02-27T04:05:33+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదులో ఆసిఫాబాద్‌ నియోజక వర్గం ముందుండాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు

టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదులో ముందుండాలి
కెరమెరి మండలం ఝరిలో సభ్యత్వ నమోదు చేపడుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు

- ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
కెరమెరి, ఫిబ్రవరి 26:  టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదులో ఆసిఫాబాద్‌ నియోజక వర్గం ముందుండాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శుక్రవారం కెరమెరి మండలం ఝరి గ్రామంలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో 250 మంది సాధారణ సభ్యత్వాలు తీసుకునే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట జడ్పీటీసీ దుర్పతాబాయి, మడావి రఘు, నాయుకలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లింగాపూర్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదును సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శుక్రవారం  మండలంలో చేపడుతున్న సభ్యత్వ నమోదును ఆయన పరిశీలించారు. ఆయన వెంట  స్థానిక నాయకులు ఉన్నారు.
    

Updated Date - 2021-02-27T04:05:33+05:30 IST