సాగర్‌లో గెలుపుపై టీఆర్‌ఎస్‌ నాయకుల సంబరాలు

ABN , First Publish Date - 2021-05-03T03:51:25+05:30 IST

నాగార్జున సాగర్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భరత్‌ భారీ మెజార్టీతో గెలుపొందడం పట్ల ఆదివారం కౌటాలలో టీఆర్‌ఎస్‌ నాయకులు సంబరాలు జరుపుకు న్నారు.

సాగర్‌లో గెలుపుపై టీఆర్‌ఎస్‌ నాయకుల సంబరాలు
కౌటాలలో సంబరాలు జరుపుకుంటున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

కౌటాల, మే 2: నాగార్జున సాగర్‌ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భరత్‌ భారీ మెజార్టీతో గెలుపొందడం పట్ల ఆదివారం కౌటాలలో టీఆర్‌ఎస్‌ నాయకులు సంబరాలు జరుపుకు న్నారు. ఈ సందర్భంగా టపాకా యలు కాల్చి, స్వీట్లు పంచారు. కార్యక్రమంలో నాయకులు శ్రీని వాస్‌గౌడ్‌, రవీందర్‌గౌడ్‌, సర్పంచ్‌ మౌనీష్‌, ఉపసర్పంచ్‌ తిరుపతి, ఎంపీటీసీ మనీష్‌, అజ్మత్‌ అలీ, బాపు, సంతోష్‌, రాంచందర్‌ పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌లో..

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 2: కాగజ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మెన్‌ కోనేరు క్రిష్ణారావు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-03T03:51:25+05:30 IST