రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా ఎదిగింది

ABN , First Publish Date - 2021-09-03T07:03:32+05:30 IST

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా ఎదిగింది

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా ఎదిగింది
జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో..

ఎమ్మెల్యే జోగు రామన్న 

జిల్లాలో ఘనంగా టీఆర్‌ఎస్‌ జెండా పండుగ

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా జిల్లా కేం ద్రంలోని కైలాస్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగుర వేశారు. బ్యాండ్‌ మేళాలతో పార్టీ కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని తెలంగాణ తల్లి, ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఢిల్లీలో కేసీఆర్‌ నాయకత్వంలో పార్టీ భవన్‌ను ఏర్పాటు చేసుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరింత పెంచే దిశగా శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. గ్రామాలు, వార్డులు, కాలనీల్లో పార్టీ జెండా పండుగను టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. నేటి నుంచి 12వ తేదీ వరకు పార్టీలో క్రీయాశీలక మార్పులు చే పట్టడం జరుగుతుందన్నారు. గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. 

నేరడిగొండ: ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణా నికి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా శంకు స్థాపన జరిగిన వేళ చరిత్రలో నూతన అధ్యాయం ఆవిష్కార మ వుతుందని జడ్పీటీసీ జాదవ్‌ అనిల్‌, ఎంపీపీ రాథోడ్‌ సజన్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో టీ ఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణాన్ని పురష్కరించుకుని పార్టీ జెండాను ఎగుర వేశారు. ఇందులో మండల ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌ పెంట వెంకట రమణ, ఉపసర్పంచ్‌ దేవేందర్‌రెడ్డి, మండల కన్వీనర్‌ శివారెడ్డి, వీడీసీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, భోజన్న, శంకర్‌, లచ్చన్న పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉట్నూర్‌: మండలంలో టీఆర్‌ఎస్‌ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ పంద్రజైవంత్‌రావ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు సింగారేభరత్‌ల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ ఎస్‌పీరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బాలాజి, మండల రైతు కమిటీ అధ్యక్షుడు అజీమొద్దిన్‌, నాయకులు దాసండ్ల ప్రభాకర్‌, రమేష్‌, కెంద్రేరమేష్‌, సుమబాయి, పోషన్న, రాజ్‌కుమార్‌, ఆశారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా లక్కారంలో లింగోజితాండ ఎక్స్‌రోడ్డులో శ్యాంపూర్‌లో దంతనపల్లి తదితర గ్రామాలలో టీఆర్‌ఎస్‌ జెండా పండుగలను సర్పంచ్‌లు రాథోడ్‌ జనార్దన్‌, జాదవ్‌హరినాయక్‌, గుండాల మల్లిక, భూమన్న పాల్గొన్నారు.

జైనథ్‌: మండల కేంద్రంలోని స్థానిక తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇందులో ఎంపీపీ ఎం.గోవర్ధన్‌, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ ఎ స్‌.లింగారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే దీపాయిగూడ గ్రామంలో41 అడుగుల పార్టీ జెండాను ఆవిష్కరించారు.

తాంసి: మండలంలో టీఆర్‌ఎస్‌ జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌ ముందు జెండాను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కన్వీనర్‌ పులి నారాయణ జెండాను ఎగుర వేశారు. ఇందులో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీపీ మంజుల, ఉపాధ్యక్షుడు రేఖరఘు, నాయకులు అరుణ్‌కుమార్‌, కృష్ణ, సదానందం, వెంకన్న, మహేశ్‌, గంగారాం పాల్గొన్నారు.

బోథ్‌: సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ రుక్మన్‌సింగ్‌ పేర్కొన్నారు. గురువారం బోథ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ టి.శ్రీనివాస్‌, ఆత్మ చైర్మన్‌ సుభాష్‌, సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌తో పాటు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

గుడిహత్నూర్‌: మండలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. గుడిహత్నూర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద మండల కన్వీనర్‌ కరాడ్‌ బ్రహ్మానంద్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ జమీర్‌, మాజీ ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్‌, జిల్లా మండల నాయకులు జాదవ్‌రమేష్‌, శ్రీనివాస్‌గౌడ్‌, పాటిల్‌ రాందాస్‌, జమీల్‌, సంతోష్‌గౌడ్‌, మడావి మాల్కు, సర్పంచ్‌లు ఎంపీటీసీలు పాల్గొన్నారు.

భీంపూర్‌: మండలంలో టీఆర్‌ఎస్‌ నేతలు జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో నాయకులు సర్పంచ్‌లు ఎంపీటీసీలు జెండాను ఎగురవేయగా మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ మేకల నాగయ్య, జడ్పీటీసీ కుంరా సుధాకర్‌, ఎంపీపీ కుడిమెత రత్నప్రభ సంతోష్‌లతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ గడ్డం లస్మన్న, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు భూమన్న దొర, నాయకులు తొడసం అమృత్‌రావ్‌, మార్చెట్టి అనిల్‌, నితిన్‌, రాకేష్‌, మనిక్‌రావ్‌ తదితరులున్నారు.

ఇచ్చోడరూరల్‌: మండలంలో టీఆర్‌ఎస్‌ జెండా పండుగను పార్టీ కార్యకర్తలు గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్ర(కె) గ్రామంలోని పంట పొలాలలో రైతులు జెండా పండుగను జరుపుకున్నారు. కోకస్‌మన్నూర్‌, సిరిసెల్మ, గేర్జం, ముఖ్ర, తలమద్రి, ధర్మపురి, బోరిగామ గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు పార్టీ జెండాలను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మచైర్మన్‌ నరాల రవీందర్‌, మాజీ మండలాధ్యక్షుడు సుభాష్‌పాటిల్‌, ఎంపీటీసీ సభ్యుడు వెంకటేశ్‌, ఉప సర్పంచ్‌లు బల్గంరవి, అబ్దుల్‌అజీజ్‌లు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌టౌన్‌: పేదల సంక్షేమం కోసం సీఎంకేసీఆర్‌ కృషి చేస్తున్నారని బేల జడ్పీటీసీ సభ్యురాలు అక్షితపవార్‌ అన్నారు. గురువారం మండలంలోని చాంద్‌పల్లి గ్రామంలో మండల టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి గులాబీ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఇందులో నాయకులు ప్రమోద్‌రెడ్డి, అడనేశ్వర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ సతీష్‌పవార్‌, స్థానిక సర్పంచ్‌ జంగుషాహు, గ్రామస్థులు, నాయకులు పాల్గొన్నారు.

బజార్‌హత్నూర్‌: మండలంలో టీఆర్‌ఎస్‌ నాయ కులు పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహిం చారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. ఇందులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ఇంద్రవెల్లి: ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ధ్యేయం అని జడ్పీ కో-అప్షన్‌ సభ్యులు మహ్మద్‌ అంజద్‌ అన్నారు. గురువారం  మండలంలోని పలు గ్రామాల్లో పార్టీ నాయకులు జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. మండలంలోని బిక్కు నాయక్‌తండా లో సర్పంచ్‌ ఆడే విజయ ఆధ్వర్యంలో జెండాను ఆవి ష్కరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ డోంగ్రే మారుతి తన నివాసంలో జెండాను ఆవిష్కరించారు. ఇందులో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌  మోహన్‌ నాయక్‌, తొడసం హరిదాస్‌, సర్కాలే శివాజీ, ఎంపీటీసీ సభ్యులు కోవా రాజేశ్వర్‌, మాజీ ఏపీపీ కనక తుకారాం, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి కనక హనుమంతరావ్‌ తదితరులు పాల్గొన్నారు.

సిరికొండ: మండలంలో గురువారం ఘనంగా జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు.  టీఆర్‌ ఎస్‌ పార్టీ నాయకులు గులాబీ జెండాను ఎగుర వేశారు. మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ గోర్బండ్‌ బాలాజీ జెండాను ఆవిష్కరించారు.   ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు గొర్ల రాజన్న,  అశోక్‌, బషీర్‌, టీఆర్‌ఎస్‌ మండల యువజన నాయకుడు బియ్యాల మల్లేష్‌, టీఆర్‌ఎస్వీ నాయకులు గొర్ల శంకర్‌, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజారాం, తదితరులు పాల్గొన్నారు.  

తలమడుగు: మండలంలో టీఆర్‌ఎస్‌ జెండా పండుగను నిర్వహించారు. ఇందులో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ తోట వెంకటేశ్‌, ఎంపీటీసీ చంటి, సర్పంచ్‌లు పోతారెడ్డి, మహేందర్‌యాదవ్‌, నర్సింహులు, సహకార సంఘం చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు కాటిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, కార్యకర్తలు తదితరులున్నారు.

Updated Date - 2021-09-03T07:03:32+05:30 IST