ఆదివాసీలు అన్ని రంగాల్లో ముందుండాలి

ABN , First Publish Date - 2021-08-10T07:24:27+05:30 IST

మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో సోమవారం ఆత్మచైర్మన్‌ మల్లెపూల సుభాష్‌ ఆదివాసీ కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు.

ఆదివాసీలు అన్ని రంగాల్లో ముందుండాలి

బోథ్‌, ఆగస్టు9: మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో సోమవారం ఆత్మచైర్మన్‌ మల్లెపూల సుభాష్‌ ఆదివాసీ కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. ప్రతి ఆదివాసీ తమ పిల్లలను చదివించాలని కోరారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ కళాకరులైన తొడసం ఆనంద్‌రావ్‌, మడావి నాగోరావ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు మడావి భీంరావ్‌, ఆత్రంసుశీల, సెడ్మకి విజయలక్ష్మి, దీటిదేవిదాస్‌, సోలంకి సత్యనారాయణలున్నారు.


Updated Date - 2021-08-10T07:24:27+05:30 IST