ధరణి పోర్టల్‌తో పారదర్శక సేవలు
ABN , First Publish Date - 2021-10-30T03:45:39+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి వెబ్‌పోర్టల్ ద్వారా పారదర్శకమైన సేవలు అందుతున్నాయని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం ధరణి ప్రారంభించి సంవత్స రం పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మధుసూధన్ నాయక్‌తో కలిసి కేక్ కట్ చేశారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 29: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి వెబ్‌పోర్టల్ ద్వారా పారదర్శకమైన సేవలు అందుతున్నాయని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం ధరణి ప్రారంభించి సంవత్స రం పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మధుసూధన్ నాయక్‌తో కలిసి కేక్ కట్ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ 2017లో భూ రికార్డులను డిజిటలైజ్ చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు వేగంగా సేవలు అందించే దిశగా ప్రభుత్వం ధరణిని రూపొందించిందన్నారు. అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా భూ సంబంధిత లావాదేవీలకు వన్‌స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుందన్నారు. ధరణి కార్య క్రమాన్ని జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేశామన్నారు. గతంలో సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ర్టేష న్‌లు జరిగేవని, ఇప్పుడు ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో సేవలు అందుతున్నాయన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో నాలా ద్వారా 521 దరఖాస్తులు రాగా 93.57 శాతంతో 488, విక్రయం, గిఫ్టు ద్వారా 11,201 దరఖాస్తులు రాగా 97 శాతంతో 10,943, తనఖా కోసం 122 దరఖాస్తులు రాగా 96.72 శాతంతో 118 పరిష్కరించామన్నారు. ప్రజావాణిలో ముటేషన్, ఆధార్ సీడింగ్, ఎన్‌ఆర్‌ఐ పీపీబీ ఇతరత్రా పరి ష్కారానికి 11,804 దరఖాస్తులు రాగా 94.98 శాతంతో 11,212లను పరిష్కరించామన్నారు. రిజిస్ర్టేషన్ సమయం లో ప్రతి సర్వే నెంబరుకు మార్కెట్ విలువ, రిజస్ర్టేషన్ రుసుం, స్టాంప్ సుంకం విలువ తెలస్తుందన్నారు. నిషేధిత భూముల లావాదేవీలు జరగకుండా వాటిని లాక్ చేశామ న్నారు. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్మ్‌ర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయన్నారు. ధరణిని సమర్ధ వంతంగా అమలు చేయడంలో అధికారులు, తహసీల్దార్ లు, సిబ్బంది అందించిన సేవలు అభినందనీయమన్నారు.