జిల్లాలో ఎస్సైల బదిలీలు
ABN , First Publish Date - 2021-10-29T06:22:15+05:30 IST
జిల్లాలో ఎస్సైలను బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.

నిర్మల్ కల్చరల్, అక్టోబరు 28 : జిల్లాలో ఎస్సైలను బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన ఎస్సైల ను తక్షణం రిలీవ్ చేయాలని ఆదేశించారు. సాయి కుమార్ ముధోల్ నుండి లోకేశ్వరం, మహేష్ కుభీర్ నుంచి బాసర బదిలీ అయ్యారు. సాయికిరణ్ భైంసా రూరల్ నుంచి ముధోల్‌కు, కే.రాజు కడెం నుంచి పెంబి, ఎండీ షరీఫ్ కుంటాల నుంచి భైంసా టౌన్, ఎం.కృష్ణసాగర్‌రెడ్డి సారంగాపూర్ రెగ్యులర్‌గా, శ్రీనివాస్ నిర్మల్ రూరల్ నుంచి ఎస్సై 2 నిర్మల్ రూరల్, శివరామకృష్ణ తానూర్ నుండి భైంసా రూరల్ 2 ఎస్సై, ప్రసాద్ దిలావర్‌పూర్ పూర్తిస్థాయి, కందులరాణి మామడ నుండి నర్సాపూర్ (జి), స్రవంతి నర్సాపూర్ నుంచి కుంటాల, జ్యోతిమణి సోన్ నుంచి దస్తూరాబాద్, ఎల్. వెంకటరమణ నర్సా పూర్ నుంచి సీసీఎస్ నిర్మల్, శ్రీరామ్ ప్రదీప్ బాసర నుండి వీఆర్ నిర్మల్, జి. రాజన్న తానూర్ నుండి సీసీఎస్ నిర్మల్, బాలకృష్ణ, యాసిర్ అరాఫత్ భైంసా నుండి సీసీఎస్ నిర్మల్, సుమన్ నిర్మల్ రూరల్ నుండి డీఎస్బీ నిర్మల్, దయానంద్‌రావు కడెం నుండి కదం ఎస్సై 2గా, తసియుద్దీన్ భైంసా నుండి వీఆర్ నిర్మల్, కే. రోహిణి దిలావర్‌పూర్ వీఆర్ నిర్మల్, జివి. రమణరెడ్డి డీఎస్బీ నిర్మల్, గంగాధర్, శివాజీ నిర్మల్ నుండి వీఆర్ నిర్మల్‌కు బదిలీ అయ్యారు. కొందరు అటాచ్‌మెంట్ ఉన్న ఎస్సైలకు పూర్తిస్థాయి బాధ్యత అప్పగించారు.