ఎస్పీ కార్యాలయం ఎదుట వ్యాపారి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-10-08T04:14:56+05:30 IST

కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన వ్యాపారి రాచర్ల శివకుమార్‌ గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఎస్పీ కార్యాలయం ఎదుట వ్యాపారి ఆత్మహత్యాయత్నం
వ్యాపారిని అడ్డుకుంటున్న పోలీసులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 7: కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన వ్యాపారి రాచర్ల శివకుమార్‌ గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాగజ్‌నగర్‌ పట్టణ సీఐ మోహన్‌ తనపై అకారణంగా చేయిచేసుకోవడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారని సదరు వ్యాపారి పెట్రోల్‌ బాటిల్‌ పట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకొని పెట్రోల్‌ బాటిల్‌ను లాగేసుకున్నారు. కాగజ్‌నగర్‌ సీఐ మోహన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని అతడు డిమాండ్‌ చేశాడు. తనకు న్యాయం జరుగని పక్షంలో ఆత్మహత్యే శరణ్యం అని వాపోయాడు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆడ్మిన్‌ వైవీఎస్‌ సుదీంధ్ర సదరు వ్యాపారికి నచ్చచెప్పారు. సీఐ మోహన్‌పై విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శాఖాపరమైన చర్యల నిమిత్తం ఐజీ, సీపీలకు నివేదికలను పంపించి చర్యలు తీసుకుంటామని బాధితుడికి హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-10-08T04:14:56+05:30 IST