నేడు జిల్లాకు జాతీయ కమిషన్‌ సభ్యుడు

ABN , First Publish Date - 2021-03-24T05:37:41+05:30 IST

బీసీ వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ సభ్యుడు ఆచారి తల్లొజి బుధవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7గంటల కు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12గంటలకు ఆదిలాబాద్‌ చేరుకుం

నేడు జిల్లాకు జాతీయ కమిషన్‌ సభ్యుడు

ఆదిలాబాద్‌ టౌన్‌, మార్చి 23: బీసీ వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ సభ్యుడు ఆచారి తల్లొజి బుధవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7గంటల కు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12గంటలకు ఆదిలాబాద్‌ చేరుకుంటారని, మధ్యాహ్నం 12.30 గంటలకు జిల్లా జైలు అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం నిర్మల్‌ జిల్లా భైంసా అల్లర్ల ఘటన నేపథ్యంలో జైలులో ఉన్న వారిని కలువనున్నారని, తిరిగి 3 గంటలకు మీడియా సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం సాయంత్రం 4గంటలకు హైదరాబాద్‌ తిరిగి వెళ్లనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-03-24T05:37:41+05:30 IST