‘పొగాకు ఉత్పత్తులను అమ్మరాదు’

ABN , First Publish Date - 2021-01-13T06:15:21+05:30 IST

పాఠశాలలకు వంద గజాల దూరం వరకు పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని పొగాకు నియంత్రణ విభాగం జిల్లా అధికారి శ్రీకాంత్‌ అన్నారు.

‘పొగాకు ఉత్పత్తులను అమ్మరాదు’

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 12: పాఠశాలలకు వంద గజాల దూరం వరకు పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని పొగాకు నియంత్రణ విభాగం జిల్లా అధికారి శ్రీకాంత్‌ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మితే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని పాత హౌజింగ్‌బోర్డు, శాంతినగర్‌, పిట్టలవాడ, గాంధీపార్కు తదితర ప్రాంతాల లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో తనిఖీ బృందం సభ్యులు చిరంజీవి, ఆశన్న, దామోదర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T06:15:21+05:30 IST