తేనెటీగల దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-05-18T07:04:38+05:30 IST

మండల కేంద్రంలో సోమవారం తేనెటీగల దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యా యి.

తేనెటీగల దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు
సోన్‌లో గజ్జెవ్వకు వైద్యచికిత్స చేస్తున్న దృశ్యం

సోన్‌, మే 17 : మండల కేంద్రంలో  సోమవారం తేనెటీగల దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యా యి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం మండ ల కేంద్రానికి చెందిన గజ్జెవ్వ(70) అనే వృద్ధురాలు నిర్మల్‌ జిల్లా కేంద్రంలో పనులను ముగించుకుని ఆటోదిగి సోన్‌ బస్టాండ్‌ వద్ద గల ఒక చెట్టు కింద అరటిపండ్లు తింటుండగా చెట్టు పైన కోతులు అర టిపండ్ల కోసం ఆరాట పడుతూ కొమ్మలను గట్టిగా ఊపడంతో అప్పటికే చెట్టు పైన తేనెటీగలు ఒకేసారి వృద్ధురాలిపై దాడి చేశాయి. అక్కడే ఉన్న గంధం వెంకటేష్‌, అష్ట శ్రీనులు వృద్ధురాలిని రక్షించడానికి ప్రయత్నించగా ముగ్గురిపై దాడి చేయగా తీవ్ర గా యాలయ్యాయి. చికిత్సల కోసం స్థానిక ఆరోగ్య కేంద్రంకు తరలించగా మెరుగైన వైద్యం కోసం  ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందు తున్నారు. 

Updated Date - 2021-05-18T07:04:38+05:30 IST