చికిత్స పొందుతూ యువతి మృతి

ABN , First Publish Date - 2021-12-27T04:43:18+05:30 IST

చికిత్స పొందుతూ ఓ యువతి మృతి చెందిన సం ఘటన కడెం మండలంలోని ధర్మాజీపేట్‌లో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఉండే లక్ష్మీ, భీమన్న దంపతులకు ఇద్దరు కూ తుళ్లు ఉన్నారు. పెద్ద కూతురుకు ఇటీవల వివాహం కాగా.. కొద్దిరోజుల క్రితం వివిధ కారణాలతో తల్లిగారి ఇంటి వద్దే ఉంటుంది. అయితే భీమన్న పెద్దకూతురు పెళ్లికి, ట్రాక్టర్‌ కోసం అప్పులు చేయగా, తీర్చేమార్గం లేక ప్రతిరోజూ మనస్థాపానికి గురయ్యేవాడు.

చికిత్స పొందుతూ యువతి మృతి

కడెం, డిసెంబరు 26: చికిత్స పొందుతూ ఓ యువతి మృతి చెందిన సం ఘటన కడెం మండలంలోని ధర్మాజీపేట్‌లో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఉండే లక్ష్మీ, భీమన్న దంపతులకు ఇద్దరు కూ తుళ్లు ఉన్నారు. పెద్ద కూతురుకు ఇటీవల వివాహం కాగా.. కొద్దిరోజుల క్రితం వివిధ కారణాలతో తల్లిగారి ఇంటి వద్దే ఉంటుంది. అయితే భీమన్న పెద్దకూతురు పెళ్లికి, ట్రాక్టర్‌ కోసం అప్పులు చేయగా, తీర్చేమార్గం లేక ప్రతిరోజూ మనస్థాపానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో కుటుంబంలో భార్య, కూతుళ్లతో గొడవ జరిగేది. కాగా ఈ నెల 24వ తేదీన తల్లి లక్ష్మీ, చిన్నకూతురు వసంత (18) కుటుంబ కలహాలు, అప్పుల బాధతో మనస్థాపానికి గురై క్రిమి సంహారక మందు తాగారు. వెంటనే కుటుంబీకులు గమనించి 108 అంబులెన్సులో ఖానాపూర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యుల సూచనల మేరకు నిర్మల్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, వసంత చికిత్స పొందు తూ ఆదివారం రాత్రి మృతి చెందగా, లక్ష్మీ పరిస్థితి మాత్రం విషమంగా ఉం ది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-27T04:43:18+05:30 IST