కార్మికుల సంక్షేమమే ప్రభుత్వలక్ష్యం

ABN , First Publish Date - 2021-05-02T06:28:59+05:30 IST

కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్‌ చైర్మన్‌ జి.ఈశ్వర్‌ అ న్నారు.

కార్మికుల సంక్షేమమే ప్రభుత్వలక్ష్యం
నిర్మల్‌లో జెండా ఎగురవేస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌

జిల్లా అంతటా ఘనంగా మేడే వేడుకలు

నిర్మల్‌ కల్చరల్‌, మే 1 : కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్‌ చైర్మన్‌ జి.ఈశ్వర్‌ అ న్నారు. మేడే సందర్భంగా శనివారం అమరవీరుల స్థూపం ఎదుటజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్‌ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మున్సి పల్‌ కార్మికులకు వేతనాలు పెంచాడని గుర్తు చేశారు. కరోనా సందర్భంగా కార్మికులు అందిస్తున్న సేవలను కొనియాడారు. కార్మికులు సైతం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. వ్యాక్సిన్‌ వేయించుకోని వారు ఎవరైనా ఉన్నట్లయితే తీసుకోవాలన్నారు. కమిష నర్‌ బాలకృష్ణ, సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ రవీందర్‌, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. నాయకులు ఫయాజ్‌, జేఎస్‌ నారాయణ, శ్రీనివాసాచారి, తదితరులు పాల్గొన్నారు. 

కడెంలో..

కడెం, మే 1 : మండల కేంద్రమైన కడెంలో శని వారం మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐఎంఎల్‌ పార్టీ చంద్రన్న వర్గం జిల్లా కమిటీ మెంబర్‌ ఆకుల సత్తన్న, బీసీపీ పార్టీ జిల్లా కార్యదర్శి పసుపుల వెంకన్న, సీపీఐఎంఎల్‌ న్యూడెమో క్రసీ ఏఐటీయూసీ మండల నాయకులు సుదర్శన్‌, సీపీఐఎం పార్టీ మండల నాయకులు మర్కం సునీల్‌, ఎలగడపలో ఎంసీపీఐయూ ఏఐసీటీయూ మండల ప్రెసిడెంట్‌ అహమద్‌ ఖాన్‌ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం నూతన్‌ కుమార్‌, డాకూరి తిరుపతి, కే. రాజేశ్వర్‌, పెంద్రంతదితరులు పాల్గొన్నారు. 

భైంసా, మే 1 : పట్టణంలో శనివారం మేడే సంబరాలు ఘనంగా జరిగాయి. ఆయా కార్మిక, ఉద్యోగ సంఘాల కార్యాలయాల్లో  మేడే దినాన్ని పురస్కరించుకొని జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.  

ఖానాపూర్‌, మే 1 : కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విదానాలపై మేడే స్పూర్తిగా నిరంతరం పోరాటం కొనసాగిద్దామని ఏఐకేఎమ్మెస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నందిరామయ్య సహా పలువురు వక్తలు పిలుపునిచ్చారు. శనివారం మేడే సందర్భంగా పట్టణంలోని పలు చోట్ట మేడే జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎమ్మెస్‌ నాయకులు నగేష్‌, వర్మ, నర్సయ్య, గోరేబాయి తదితరులున్నారు. 

లక్ష్మణచాంద, మే 1 : మండలంలోని వడ్యాల్‌ గ్రామంలో మే డే ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూని యన్‌ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌. గంగన్న  జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థ లన్నింటినీ ప్రైవేటీకరించి కార్మికుల హక్కులను కాల రాస్తుందన్నారు. పెట్టుబడిదారి వర్గానికి అనుకూలంగా తమ పరిపాలన కొనసాగిస్తూ కార్మికవర్గానికి నష్టం చేస్తుందని అన్నారు. అందువలన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కిషన్‌, లింగన్న, ఆశన్న, సాయన్న, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-02T06:28:59+05:30 IST